అమెజాన్‎లో బ్లాక్ ఫ్రైడే సేల్స్

అమెజాన్‎లో బ్లాక్ ఫ్రైడే సేల్స్
  • బ్లాక్ ఫ్రైడేకు మన సెల్లర్లు రెడీ
  • అమెజాన్ వెబ్‌‌‌‌సైట్ ద్వారా అమ్మకాలు జరపనున్న 70 వేల మంది వ్యాపారులు
  • ముఖ్యంగా క్లాత్స్‌‌‌‌, ఆఫీస్ ప్రొడక్ట్‌‌‌‌లు, కిచెన్, హెల్త్‌‌‌‌, పర్సనల్ కేర్ ప్రొడక్ట్‌‌‌‌లు..
  • రూ. కోట్లల్లో బిజినెస్‌‌‌‌ జరుగుతుందని అంచనా

న్యూఢిల్లీ: అమెజాన్‌‌‌‌ ద్వారా గ్లోబల్‌‌‌‌గా తమ  ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మేందుకు 70 వేల మంది ఎక్స్‌‌‌‌పోర్టర్లు రెడీ అవుతున్నారు.  గ్లోబల్‌‌‌‌ సెల్లింగ్ ప్రోగ్రామ్‌‌‌‌ ద్వారా దేశంలో తయారైన లక్షల ప్రొడక్ట్‌‌‌‌లు గ్లోబల్‌‌‌‌గా అమ్ముడవుతాయని అంచనా. బ్లాక్‌‌‌‌ ఫ్రైడే అండ్‌‌‌‌ సైబర్ మండే (బీఎఫ్‌‌‌‌సీఎం) సేల్స్‌‌‌‌ ఈ నెల 25 న స్టార్టయ్యి, 29 న ముగుస్తాయి. యూఎస్ వంటి పశ్చిమ దేశాల్లో బ్లాక్ ఫ్రైడే  తర్వాత నుంచి హాలిడే సీజన్ స్టార్టవుతుంది. ఈ టైమ్‌‌‌‌లో పెద్ద మొత్తంలో సేల్స్ జరుగుతాయని అంచనా. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఎక్స్‌‌‌‌పోర్టర్లు చూస్తున్నారు. వీరికి అమెజాన్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ సెల్లింగ్ ప్రోగ్రామ్‌‌‌‌ తోడవుతోంది. మొత్తం 52 వేల కొత్త ప్రొడక్ట్‌‌‌‌లను అమెజాన్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో దేశ ఎగుమతిదారులు లాంచ్‌‌‌‌ చేశారని అమెజాన్ ప్రకటించింది. గ్లోబల్‌‌‌‌గా ఉన్న అమెజాన్ కస్టమర్లు  హోమ్‌‌‌‌ అండ్ కిచెన్‌‌‌‌, క్లాత్స్‌‌‌‌, ఆఫీస్‌‌‌‌ ప్రొడక్ట్‌‌‌‌లు, నగలు, బ్యూటీ ప్రొడక్ట్‌‌‌‌లు, ఫర్నిచర్ వంటి ప్రొడక్ట్‌‌‌‌లను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుందని అమెజాన్  పేర్కొంది. అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ తర్వాత రోజును బ్లాక్ ఫ్రైడేగా జరుపుతారు. 

ఎంఎస్‌‌‌‌ఎంఈలకు ఉపయోగం..
హాలిడే ట్రెండ్స్‌‌‌‌ను బట్టి ఎటువంటి ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మాలో  ఎక్స్‌‌‌‌పోర్టర్లకు వివరిస్తున్నామని అమెజాన్ పేర్కొంది. వీరి ప్రొడక్ట్‌‌‌‌ల నిల్వలు రెడీ అవ్వడంలో లాజిస్టిక్‌‌‌‌ సేవలను,  ఎలా ప్రొడక్ట్‌‌‌‌లను అమ్ముకోవాలో సూచనలను ఇస్తున్నామని తెలిపింది.  ‘గ్లోబల్‌‌‌‌ హాలిడే సీజన్‌‌‌‌ బ్లాక్‌‌‌‌ ఫ్రైడేతో స్టార్టవుతుంది. దేశంలోని పండగ సీజన్‌‌‌‌ తర్వాత  ఈ హాలిడే పీరియడ్‌‌‌‌ వస్తోంది. ఇది మా సెల్లింగ్ పార్టనర్లకు కీలకం. ఎక్కువ మంది ఈ–కామర్స్‌‌‌‌పై  ఆధారపడుతుండడంతో ఈ సారి బ్లాక్‌‌‌‌ ఫ్రైడే సేల్స్‌‌‌‌ మా సెల్లర్ల గ్రోత్‌‌‌‌కు సాయపడతాయని అంచనావేస్తున్నాం’ అని అమెజాన్ ఇండియా గ్లోబల్ ట్రేడ్ డైరెక్టర్‌‌‌‌ అభిజిత్‌‌‌‌ కమ్రా పేర్కొన్నారు.  ఇండస్ట్రీలు తమ ఎక్స్‌‌‌‌పోర్ట్ బిజినెస్‌‌‌‌ను పెంచుకోవడంలో అమెజాన్‌‌‌‌ గ్లోబల్‌‌‌‌ సెల్లింగ్ ప్రోగ్రామ్‌‌‌‌ సాయపడుతుందని చెప్పారు.  ‘ఈ  ప్రోగ్రామ్‌‌‌‌ ద్వారా దేశంలోని ఎంఎస్‌‌‌‌ఎంఈలకు ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ను సులభం చేస్తున్నాం. ఎగుమతులు పెంచాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సాయపడుతున్నామ’ని అభిజిత్ పేర్కొన్నారు. బొమ్మలు, కొన్ని బ్రాండ్ల క్లాత్స్‌‌‌‌, టీ బ్రాండ్లు వంటి దేశంలోని పాపులర్‌‌‌‌‌‌‌‌,  యునిక్ ప్రొడక్ట్‌‌‌‌లను గ్లోబల్‌‌‌‌గా అమ్మేందుకు ఎక్స్‌‌‌‌పోర్టర్లకు వీలు కలుగుతుంది. కాగా, ఎంఎస్‌‌‌‌ఎంఈ ఎక్స్‌‌‌‌పోర్ట్స్‌‌‌‌ను పెంచేందుకు 2015 లో గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రామ్‌‌‌‌ను అమెజాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్‌‌‌‌ కింద 7‌‌‌‌‌‌‌‌0 వేల మంది సెల్లర్లు లిస్ట్ అయ్యారు. ఈ ప్రోగ్రామ్‌‌‌‌ కింద ఇప్పటి వరకు 3 బిలియన్ డాలర్ల విలువైన సేల్స్‌‌‌‌ జరిగాయని అభిజిత్​ చెప్పారు.