బంగారం ప్రియులకు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బంగారం కొనుగోలు చేయాలంటే పెద్దమొత్తంలో నగదు కావాలి. కానీ అమెజాన్ అందుబాటులోకి తెచ్చిన అమెజాన్ గోల్డ్ వాల్డ్ తో కేవలం రూ.5 ఉన్నా సరిపోతుంది. రూ.5తో డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయోచ్చు. అమ్ముకోవచ్చు.
ఈ సదుపాయంతో అమెజాన్ ‘గోల్డ్ వాల్ట్’ పేటీఎం, ఫోన్‌పే, మొబిక్విక్ వంటి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లతో పోటీ పడనుంది.
ఈ సదుపాయాన్ని పేటీఎం అందరి కన్నా ముందుగా డిజిటల్ గోల్డ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫోన్‌పే కూడా తర్వాత ఈ తరహా సర్వీస్ లను లాంచ్ చేసింది. 2017లోనే ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. తర్వాత 2018లో మొబిక్విక్ కూడా ఈ సేవలు తీసుకువచ్చింది. 2019లో గూగుల్ పే ఈ సర్వీసులు లాంచ్ చేసింది. సేఫ్‌గోల్డ్ సంస్థలో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ సదుపాయాన్ని కొనుగులు దారులకు అందించేందుకు అమెజాన్ సేఫ్ గోల్డ్ తో జతకట్టింది. తద్వారా 9 క్యారెట్ల బంగారాన్ని 99. 5 శాతం స్వచ్ఛతతో అందిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టడాన్ని వీలు కల్పిస్తుంది. పెట్టుబడిదారులు వర్చువల్ బంగారాన్ని ఎప్పుడైనా తాజా ధరకు కొనుగోలు చేయవచ్చు అమ్ముకోవచ్చు. తాజాగా మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతి ఐదు నిమిషాలకు ధర రిఫ్రెష్ అవుతుంది.
