అమెజాన్ తమ కంపెనీల్లో ఉద్యోగుల కోత ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. దాన్ని అమలు పరుస్తూ తాజాగా ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ చేసింది. లే ఆఫ్ ప్రక్రియ తొలుత భారత్ నుంచి మొదలుపెట్టింది. మొత్తం 18వేల మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. తాజాగా వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు మెయిల్స్ కూడా పంపారు.
భారత్ లో టెక్, హ్యూమన్ రిసోర్స్ విభాగాల్లో 1000 మందికిపైగా అమెజాన్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఈనెల 18 తర్వాత తొలగించబడ్డ ఉద్యోగులతో అమెజాన్ సంస్థ సంప్రదింపులు జరుపుతుందని సీఈఓ ఆండీ జాసీ వెల్లడించారు. అంతేకాకుండా 5 నెలల జీతాన్ని ఉద్యోగులకు పరిహారంగా అందించనున్నట్లు ఆండీ జూసీ హామీ ఇచ్చారు. దాంతో ఉద్యోగులంతా లింక్డ్ ఇన్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల్లో ఉద్యోగాలకోసం వెతుకుతున్నారు.
