MX player: ఎంఎక్స్ ప్లేయర్ కొనుగోలు చేయనున్న అమెజాన్

MX player: ఎంఎక్స్ ప్లేయర్ కొనుగోలు చేయనున్న అమెజాన్

భారత్ లో ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ప్లాట్ ఫామ్ ను మరింత విస్తరించే దిశగా అమెజాన్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్ ను కొనుగోలు చేయనుంది. భారత్ లో అమెజాన్ కు 28 మిలియన్ల ప్రైమ్ సబ్ స్క్రైబర్లు ఉండగా.. ఎంఎక్స్ ప్లేయర్ కి 78 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఉన్నారు. అయితే, 2018లోనే టైమ్స్ ఇంటర్నెట్ సంస్థ 146 మిలియన్ డాలర్లకు ఎంఎక్స్ ప్లేయర్ ను కొనుగోలు చేసింది. ఇప్పుడు టైమ్స్ ఇంటర్నెట్ నుంచి అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ ని కొనేందుకు రెడీ అవుతోంది.