ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ఆమెజాన్‌

 ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి ఆమెజాన్‌

ఆన్‌ లైన్‌ రీటైల్‌ రంగ దిగ్గజం అమెజాన్‌ ఫుడ్ డెలివరీ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన ఉబర్‌ అనుబంధ సంస్థ ఉబర్‌ ఈట్స్‌ను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నాయి. ఇది సాధ్యం కాకపోతే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా ఏర్పర్చుకొనే అవకాశం ఉంది. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు ఉబర్‌ నిరాకరించింది.  అమెజాన్‌ ఇండియా విభాగం ఫుడ్‌డెలివరీ వ్యాపారంపై చాలా అసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.