ముంబై: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈ నెల 17 వ తేదీన స్టార్టవనుంది. ప్రైమ్ మెంబర్లకు ఈ సేల్16 వ తేదీ నుంచే అందుబాటులో ఉంటుంది. ఈ నెల 20 న ముగియనున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా షియోమి, వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, ఐకూ వంటి స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లను అమెజాన్ ప్రకటించింది. రూ. 16 వేల దాకా ఎక్స్చేంజ్ ఆఫర్లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, యాక్సెసరీల కొనుగోలుపై క్యాష్‌బ్యాక్‌లూ అందించనున్నట్లు తెలిపింది. సేల్ పీరియడ్‌లో ఫ్రీ హోమ్ డెలివరీ, పే ఆన్ డెలివరీ (సీఓడీ), ఈజీ రిటర్న్‌లతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంటూ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. షియోమి, వన్‌ప్లస్, శాంసంగ్, యాపిల్, ఐకూ మొబైల్స్‌పై 40 శాతం దాకా డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని పేర్కొంది. వన్‌ప్లస్, శాంసంగ్, సోనీ, షియోమి వంటి స్మార్ట్‌టీవీ బ్రాండ్లపై 60 శాతం దాకా డిస్కౌంటు దొరుకుతుందని వెల్లడించింది. ఇక లార్జ్ అప్లయెన్సెస్‌పై 50 శాతం డిస్కౌంట్ ఉంటుందని కూడా అమెజాన్ తెలిపింది.
