అమెజాన్‌‌‌‌ – ఫ్యూచర్‌‌ డీల్‌‌కు బ్రేక్‌‌

అమెజాన్‌‌‌‌ – ఫ్యూచర్‌‌ డీల్‌‌కు బ్రేక్‌‌

న్యూఢిల్లీ: ఫ్యూచర్‌‌ గ్రూపునకు చెందిన ఫ్యూచర్‌‌ కూపన్స్‌‌తో అమెజాన్‌‌ కుదుర్చుకున్న ఒప్పందానికి అనుకూలంగా ఇది వరకు ఇచ్చిన ఉత్తర్వులను కాంపిటిషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్ ఇండియా (సీసీఐ) వెనక్కి తీసుకుంది. రూల్స్‌‌ను ఉల్లంఘించినందుకు అమెజాన్‌‌కు రూ.202 కోట్ల ఫైన్‌‌ చేసింది. ఫ్యూచర్‌‌ కూపన్స్‌‌లో అమెజాన్‌‌ 49 శాతం వాటా కొనడం సబబేనంటూ సీసీఐ 2019 నవంబరులో తీర్పు చెప్పింది. ఈ డీల్‌‌పై వివాదం ఏర్పడటంతో రెండు కంపెనీలూ సీసీఐకి ఈ ఏడాది జూలైలో ఫిర్యాదు చేశాయి. ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో రిలయన్స్ వాటా కొనడాన్ని అమెజాన్‌‌ సవాల్‌‌ చేయడంతో వివాదం రేగింది.