14ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిన రిలయన్స్ మార్కెట్ విలువ‌

14ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిన  రిలయన్స్  మార్కెట్ విలువ‌

రిలయన్స్‌ఇండస్ట్రీస్ ‌లిమిటెడ్ ‌మార్కెట్ వాల్యూ రూ . 14 లక్షల కోట్ల మార్క్ ను దాటేసింది. శుక్రవారం సెషన్‌‌లో రిలయన్స్‌షేరు 4 శాతం లాభపడటంతో మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 14 లక్షల కోట్లను దాటింది. కంపెనీ రైట్స్ ఇష్యూ కింద జారీ చేసిన పార్టీలీ పెయిడ్ ‌‌అప్ షేర్లవిలువ రూ. 53, 821 కోట్లకు చేరింది.
దీంతో మొత్తం ఆర్‌‌ఐఎల్‌‌మార్కెట్‌వాల్యూ రూ. 14,07,854.41 కోట్లకు పెరిగింది. బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు 4.32 శాతం పెరిగి రికార్డు హై రూ. 2,149.70 కి చేరడం విశేషం. రిలయన్స్‌ రిటైల్‌‌లో అమెజాన్‌‌వాటా కొంటోం దనే వార్తల నేపథ్యం లో గురువారం కూడా రిలయన్స్‌ షేరు 3 శాతం పెరిగింది.