భారత్ మార్కెట్ పై అమెజాన్ కన్ను : ఎయిర్ టెల్ లో 5శాతం వాటా కొనుగోలుకు ప్లాన్

భారత్ మార్కెట్ పై అమెజాన్ కన్ను : ఎయిర్ టెల్ లో 5శాతం వాటా కొనుగోలుకు ప్లాన్

నిన్న జియో నేడు ఎయిర్ టెల్ లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ జియో లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది.

తాజాగా అమెరికా ఈ- కామర్స్ దిగ్గజం  అమెజాన్ సైతం ఎయిర్ టెల్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ మార్కెట్ పరంగా ఎయిర్ టెల్ లో 5శాతం వాటాను  అమెజాన్ కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మనదేశంలో డిజిటల్ ఎకానమీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో 300మిలియన్లకు పైగా వినియోగదారులతో  మూడో స్థానం లో ఉన్న అతిపెద్ద టెలికాం సంస్థగా చెలామణి అవుతున్న ఎయిర్ టెల్ ను అమెజాన్  కొనుగోలు చేస్తున్నట్లు  ది హిందు తెలిపింది. ది హిందు కథనం ప్రకారం.. అమెజాన్ కు ఎయిర్ టెల్ కు మధ్య చర్చలు జరుగుతున్నాయని, ప్రణాళిక బద్ధమైన పెట్టుబడుల   పూర్తయితే అమెజాన్, ఎయిర్ టెల్ లో 5శాతం వాటాను కొనుగోలు చేయడం ఖాయమేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.

మరోవైపు అమెజాన్ భారత్ లో తన మార్కెట్ ను విస్తరించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ-కామర్స్ రంగంలో భారీగా మార్కెట్ ఉన్న భారత్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల అమెజాన్ లాభాల పంట పండినట్లేనని, అందుకే అమెజాన్ ఇక్కడ వివిధ రూపాల్లో  6.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను  పెట్టేందుకు టార్గెట్ గా పెట్టుకున్నట్లు ది హిందూ తన కథనంలో పేర్కొంది.