జమ్మూ కశ్మీర్‌లో వాతావరణ పరిస్థితులు మెరుగుపడడంతో అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra 2022) తిరిగి ప్రారంభమైంది. యాత్రను ఒకరోజు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం యాత్ర తిరిగి ప్రారంభమైందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జమ్మూ డివిజనల్ కమిషనర్ ట్వీట్ చేశారు. వాతావరణం ప్రతికూలంగా మారడంతో యాత్రను మంగళవారం తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. Chandanwari, Baltal, Ganderbal మార్గాల ద్వారా యాత్రికులు బుధవారం బయలుదేరారు. ఇప్పటి వరకు 65 వేల మంది పాల్గొన్నట్లు అంచనా.
రెండేళ్ల నుంచి కరోనా కారణంగా అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. అయితే కరోనా తగ్గడంతో ఈ ఏడాది నుంచి యాత్ర పునః ప్రారంభం అయ్యింది. జూన్ 30 నుంచి ప్రారంభమైన యాత్ర ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. మంచు కొండల్లో కొలువై ఉన్న శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. ఈ ఏడాది 3 లక్షలకు పైగా భక్తులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమర్ నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులు తప్పకుండా ఆధార్ కార్డుగానీ, ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ గానీ సమర్పించాల్సి ఉంటుంది.
#ShriAmarnathJiYatra2022
— Amarnath Yatra 2022 (@amarnathyatra21) July 6, 2022
Today Yatra has been started in Baltal domel gate @nitishwarKumar @dcganderbal @dcjammuofficial @ShriSasb @dr_piyushsingla pic.twitter.com/5wxiwZfTHQ
