అమర్నాథ్ యాత్రకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం మొదటి పూజ నిర్వహించారు. ఇందులో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. యాత్రను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్నాథ్ యాత్ర జరగనుంది.
