విమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో కాసేపట్లో భారత్ తో మ్యాచ్ ప్రారంభం కానుండగా ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ గాయంతో టీమిండియాతో జరగబోయే మ్యాచ్ ఆడట్లేదు. షార్జా క్రికెట్ స్టేడియానికి ఆమె ఊతకర్రల సహాయంతో నడుస్తూ కనిపించింది. దీంతో ఆమె ఈ మ్యాచ్ కు దూరం కానుంది. పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా ఆసీస్ సారధి గాయపడింది. రెండో పరుగు కోసం ప్రయత్నించి ఆమె మధ్యలోనే రిటైర్ కావాల్సి వచ్చింది.
భారత్ తో మ్యాచ్ కు ముందుకు ఫిట్ గా ఉంటుందని భావించినా అలా జరగలేదు. హీలే గాయపడడంతో ఆమె స్థానంలో మూనీ కెప్టెన్సీ చేసే అవకాశముంది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సెమీస్ కు వెళ్లేందుకు చక్కని అవకాశం కుదిరింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ గా తహిలా మెగ్రాత్ చేస్తుంది. ఆమె టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. సెమీస్ కు వెళ్లాలంటే రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ముఖ్యంగా భారత్ ఈ మ్యాచ్ లో ఓడిపోతే సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.
ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పు తో బరిలోకి దిగుతుంది. సంజన స్థానంలో ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకార్ తుది జట్టులోకి వచ్చింది. మరోవైపు ఆస్ట్రేలియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Australia won the toss and elected to bat first against India ?
— OneCricket (@OneCricketApp) October 13, 2024
? Alyssa Healy has been out of #INDvsAUS clash with a foot injury.#T20WorldCup #HarmanpreetKaur #Cricket pic.twitter.com/fDrisAnLc0