అరకు నుంచి హైదరాబాద్ కు తెచ్చి..అల్వాల్లో గంజా బిజినెస్.. ఆరుగురి అరెస్ట్

  • 10కిలోల గంజాయి రవాణా 
  • 10కిలోల గంజాయి రవాణా ఆరుగురి ముఠా అరెస్ట్ 
  • గంజాయి ముఠా గుట్టురట్టు
  •  పది కిలోల గంజా స్వాధీనం.. ఆరుగురి అరెస్టు  

అల్వాల్, వెలుగు: గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుంచి పది కిలోల గంజాయి ని అల్వాల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కానాజిగూడ గ్రీన్ ఫీల్స్ కాలనీలో ఆదివారం గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.  

అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేయగా.. ముగ్గురి వద్ద 10 కిలోల గంజాయి లభించింది.  ఆంధ్రప్రదేశ్ లోని అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయాలు చేస్తున్నట్లు వారు అంగీకరించారు. విక్రయిస్తున్న వారిలో శేఖర్(28), రవి నాయక్(25), మధుసూదన్(25), కాగా కొనుగోలు చేస్తున్న వారు కళ్యాణ్(23), రాజు(24), నరేశ్(25) ఉన్నారు. వీరందరూ హస్మత్ పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.