మారుతీ సుజుకీ ఇండియా తన ఎంట్రీ లెవెల్ కారు ఆల్టో కొత్త వెర్షన్‌ను గురువారం ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీఎక్స్‌ఎల్‌ప్లస్ అనే పేరు గల ఈ మోడల్ ఢిల్లీ ఎక్స్-షోరూం ధర రూ.3.80 లక్షలు. ఏరో ఎడ్జ్ డిజైన్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, ఎక్కువ మైలేజీ, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు దీని ప్రత్యేకతలు. వినోదం కోసం 17.8 ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటేన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. బీఎస్-6 స్టాండర్డ్స్ కలిగిన ఇందులోని పెట్రోల్ ఇంజన్ లీటరుకు 22 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
