వచ్చే ఐదేండ్లలో 50 శాటిలైట్లు ప్రయోగిస్తం : ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్

వచ్చే ఐదేండ్లలో 50 శాటిలైట్లు ప్రయోగిస్తం :  ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్

న్యూఢిల్లీ:  దేశ జియో -ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి వచ్చే ఐదేండ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ( ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. ఈ శాటిలైట్లను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్టి, పలు ప్రాంతాలపై నిఘాతో పాటు దళాల కదలికలను పర్యవేక్షించవచ్చని తెలిపారు. 

బార్డర్ తోపాటు పొరుగు దేశాల సైనికుల కదలికలను గమనించవచ్చన్నారు. దేగురువారం ఆయన ఐఐటీ బాంబేలో నిర్వహించిన వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్‌‌‌‌లో మాట్లాడారు.  సూర్యుడిపై స్టడీ చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్1 శాటిలైట్ తన ప్రయాణంలో తుది అంకానికి చేరుకుందని సోమనాథ్ తెలిపారు. ఆదిత్య ఎల్1 జనవరి 6వ తేదీన తన గమ్య స్థానమైన ఎల్1(లాగ్రాంజ్ పాయింట్-1) పాయింట్ వద్దకు చేరుకోనుందని వెల్లడించారు.