చంచల్ గూడ జైల్లోనే అల్లు అర్జున్.. డిసెంబర్ 14న విడుదల

హైదరాబాద్: చంచల్ గూడ జైలులో ఉన్న  అల్లు అర్జున్ డిసెంబర్ 14న విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.  సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు అల్లు అర్జున్‎కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ..  ఆర్డర్ కాపీ ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడంలో ఆలస్యం అయ్యింది.  చంచల్ గూడ జైలు అధికారులు ఈ ఆర్డర్  కాపీని డౌన్లోడ్ చేసుకున్నారు.  ఆర్డర్ కాపీని జైలు  సూపరింటెండెంట్ అధికారి పరిశీలించారు.అయితే అప్పటికే సమయం  రాత్రి 11 గంటలు దాటడంతో అల్లు అర్జున్ ఈ రాత్రి జైల్లోనే ఉండనున్నారు.  అల్లు అర్జున్ డిసెంబర్ 14న ఉదయం 7 గంటలకు రిలీజ్అవుతారని అధికారులు తెలిపారు.

అల్లు అర్జున్  ఇవాళ (డిసెంబర్ 13) రాత్రి జైల్లోనే ఉండనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులోని మంజీరా బ్యారక్‎లో అల్లు అర్జున్‎ ఉన్నారు.  క్లాస్ వన్ బ్యారక్ ను సిద్ధం చేశారు జైలు అధికారులు. జైలులో అల్లు అర్జున్ అధికారులు టీ, స్నాక్స్ ఇచ్చినట్లు తెలిసింది.

ALSO READ : బట్టలు మార్చుకోవడానికి అల్లు అర్జున్‎కు టైమ్ ఇచ్చాం: పోలీసుల వివరణ

 మరోవైపు చంచల్ గూడ జైలు వద్ద భారీగా భద్రతను పెంచారు పోలీసులు. బన్నీ విడుదల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అల్లు ఫ్యాన్సీ పెద్ద ఎత్తున చంచలగూడ జైలుకు వద్దకు తరలివస్తున్నారు. జైలు నుండి బయటకు వస్తోన్న తమ అభిమాన నటుడికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.

 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య ధియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళా చనిపోగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో సంధ్య థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్‎ తో పాటు మరి కొందరిపై చిక్కడపల్లి  పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 13) పోలీసులు బన్నీ అరెస్ట్ చేశారు.