అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. పాయింట్ టు పాయింట్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సంధ్య థియేటర్ ఘటనపై శనివారం అసెంబ్లీలో చర్చ అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన అంశాలు పాయింట్ టు పాయింట్.. 

  • సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన యాక్సిడెంట్ గా జరిగింది
  • ఈ ప్రెస్ మీట్ ఎవ్వరినీ ఉద్దేశించినది కాదు
  • ఎవరినీ బ్లేమ్ చేయడానికి కాదు
  • నాపై వస్తున్న ఆరోపణలపై స్పందించడానికి మాత్రమే ప్రెస్ మీట్
  • ఈ ఘటనలో ఎవరి తప్పూ లేదు
  • ఎవరూ కావాలని చేయలేదు
  • పోలీసులకు ముందుగా చెప్పాం.. వాళ్లు సార్టౌట్ చేస్తున్నారని అనుకున్నాం
  • పోలీసులు, థియేటర్ యాజమాన్యం, మేము ఎవరమైనా ఏ చిన్న తప్పు జరగకూడదని ప్రయత్నించాం
  • గత 20 ఏళ్లుగా సినిమా చూస్తున్నాం.. ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు
  • గత మూడేళ్లుగా సంధ్య ధియేటర్ లో సినిమా చూస్తున్నాను
  • సినిమా నుంచి నేర్చుకోవాలని థియేటర్ కు వస్తుంటా
  • తర్వాతి సినిమాకు ఇంకా బెటర్ గా ఎలా చేయాలని సినిమా చూసి తెలుసుకుంటా
  • అందరికీ వినోదం ఇవ్వడానికే సినిమా తీస్తున్నాను
  • అలాంటిది ఫ్యాన్స్ కు ఏదైనా జరిగితే బాధ పడకుండా ఉంటానా
  • పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా రోడ్ షో చేయలేదు
  • జనాలు ఎక్కువగా వచ్చారని కార్ లోపలే కూర్చున్నా
  • కానీ నన్ను చూసేందుకు వచ్చిన జనాలకు కనీసం నన్ను చూపించక పోతే వారికి ఏం చేసినట్లు
  • అందుకే కార్ లో నుంచి లేచి చిన్న గెస్చర్ ఇచ్చాను
  • చాలా క్రౌడ్ ఉంది కంట్రోల్ చేయలేక పోతున్నాం మీరు చెప్పండని పోలీసులు చెప్పారు
  • అందుకే ముందుకు వెళ్లాలని సైగలతో సూచించా.. ఫ్యాన్స్ మూవ్ అయ్యారు
  • అందరు క్షేమంగా ఉండాలని బాధ్యతగా వ్యవహరించాను..
  • సినిమా చూస్తుంటే థియేటర్ లోపలికి వచ్చి పోలీసులు ఎవ్వరూ నాకు ఏం చెప్పలేదు..
  • పోలీసులు వచ్చి వెళ్లిపొమ్మని చెప్పారనడం అబద్ధం
  • మేనేజర్ వచ్చి చెప్పారు.. ఓవర్ క్రౌడ్ అవుతుందని.. వెంటనే వెళ్లిపోయాను..
  • ఆ తర్వాతి రోజు తెలిసింది..ఒక మహిళ చనిపోయిందని.. బాబు గాయపడ్డాడని.. 
  • ఆ విషయం తెలిసి చాలా షాక్ అయ్యాను.
  • తొక్కిసలాట జరిగిందని తెలిసినా సినిమా చూశానంటున్నారు
  • తెలిసి కూడా నేను సినిమా చూస్తానా.. 
  • ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే బాధ కలిగింది..
  • నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది
  • అది నన్ను చాలా బాధ కలిగించింది.
  • నేను పరామర్శించడానికి వెళ్లలేదని అంటున్నారు
  • చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల కోసమే ఎంత దూరమైనా వెళ్లే వాడిని
  • నా అభిమానులకు ఏదైనా జరిగితే వెళ్లనా?
  • ఆస్పత్రికి వెళ్లమని బన్నీ వాసుకు చెప్పాను.. 
  • నేను ఆస్పత్రికి వస్తా అంటే మళ్లీ క్రౌడ్ అవుతుందని, ఇబ్బందులు అవుతాయని చెప్పారు..
  •  లీగల్ టీమ్ వెళ్లొద్దని చెప్పడంతో ఆగిపోయా.. 
  • ఎక్కడో ఎవరో చనిపోతే వెళ్లిపోతా.. కానీ నా ఫ్యాన్స్ కి ప్రాబ్లం వస్తే నేను కలవనా..
  •  కానీ లీగల్లీ ఇబ్బంది అవుతుందని వెళ్లలేదు..
  • అందరికీ ధన్యవాదాలు..