రోడ్ షో కాదు.. ప్రచారం కాదు..నా తప్పేం లేదు : అల్లు అర్జున్

పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా తను రోడ్ షో చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది రోడ్ షో కాదని అల్లు అర్జున్ అన్నారు. సంధ్య  థియేటర్ కు దగ్గర్లో కారు ఆగిపోయిందని.. తన కోసం వచ్చిన అందరి కోసం ఒక గెస్చర్ ఇచ్చానని తెలిపారు. 

అంతమంది వచ్చినపుడు నేను లోపల దాక్కుంటే వాళ్లకు నేను ఏమిచ్చినట్లు.. అందుకోసమే నేను బయటికొచ్చి చేతులు ఊపుతూ ముంందుకు వెళ్లమని చెప్పానని.. బాధ్యతగా వ్యవహరించానని  తెలిపారు. 

ALSO READ | శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల.. కిమ్స్ వైద్యులు ఏం చెప్పారు

ప్యాన్స్ కు తాను చెబితేనే వెళ్తారని  పోలీసులు కూడా చెప్పడంతో బయటకి రావడం జరిగిందని అన్నారు. బాధ్యతగా అందరినీ ముందుకు వెళ్లాలని చెప్పినట్లు తెలిపారు. 

తన వ్యక్తిత హననం జరుగుతుందని, అందుకోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు అల్లు అర్జున్ తెలిపారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగింది అనుకోని యాక్సిడెంట్ అని, అందులో ఎవరి తప్పు లేదని అన్నారు.