అల్లు అర్జున్ అరెస్టుపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి (39) భర్త భాస్కర్ స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ తప్పు లేదని ఆయన అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై పోలీసులు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని.. టీవీలో చూశానని, అవసరమైతే పెట్టిన కేసును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
తన కుమారుడు శ్రీ తేజ్ (9) పుష్ప -2 సినిమా చూడాలని పట్టుబడటంతోనే భార్యాపిల్లలతో కలిసి సంధ్య థియేటర్ కు వెళ్లినట్లు మృతురాలి భర్త మీడియాకు తెలిపారు. జరిగిన ఘటనకు అల్లు అర్జున్ రావటానికి సంబంధం లేదని అన్నారు. కేసు వాపసు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ALSO READ : పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా.. ఫైర్.. : అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలోని టీషర్ట్ పై క్యాప్షన్ ఇదే..
మరోవైపు, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. దాంతో, పోలీసులు అతన్ని కేసేపట్లో చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. అంతకుముందు పోలీసులు అల్లు అర్జున్‌కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు.