సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు.డిసెంబర్ 27 వరకు రిమాండ్ విధించింది కోర్టు. కాసేపట్లో అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ పై నాంపల్లి కోర్టులో ప్రభుత్వ తరపు లాయర్, అల్లు అర్జున తరపు లాయర్ మధ్య రెండు గంటల పాటు వాదోపవాదనలు జరిగాయి.
ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు
- సంధ్య థియేటర్ ఘటన కేసులో ఏ11గా అల్లు అర్జున్
- అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశాం
- ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్ చేశాం
- అల్లు అర్జున్ ర్యాలీగా రావడం వల్లే తొక్కిసలాట జరిగింది
- పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నా అల్లు అర్జున్ ర్యాలీగా వచ్చారు
- క్వాష్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోవద్దు
- సినిమా చూసేందుకు అల్లు అర్జున్ ఎవరి పర్మిషన్ తీసుకోలేదు
అల్లు అర్జున్ లాయర్ వాదనలు
- క్వాష్ పిటిషన్ తీర్పు వచ్చే వరకు ఆగాలి
- 105 సెక్షన్ అల్లు అర్జున్ కు వర్తించదు
- రేవతి మరణానికి అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కారణం కాదు
- అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం
- తొక్కిసలాటతో అల్లు అర్జున్ కు సంబంధం లేదు
- ప్రీమియర్ షోకు యాజమాన్యానికి ముందుగానే సమాచారం ఇచ్చాం
- ఉద్దేశపూర్వకంగా ఎక్కడా నిర్లక్ష్యం జరగలేదు
- పోలీసుల తరపు లాయర్
- ఎఫ్ఐఆర్ లో పెట్టిన కేసులు అల్లు అర్జున్ కు వర్తించవు
- సంచలనం కోసమే అల్లు అర్జున్ అరెస్ట్
- అల్లు అర్జున్ కు బెయిలిస్తే విచారణకు సహకరిస్తారు