Allu Arjun case : చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్..

నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్  విధించడంతో  అల్లు అర్జున్  ను చంచల్ గూడ జైలు లోపలికి వెళ్లిపోయారు.  రోప్ టీమ్స్  తో అలెర్ట్ అయిన పోలీసులు నాంపల్లి కోర్టు నుంచి ట్రాఫిక్ క్లియర్ చేసి భారీగా బందోబస్తు  మధ్య జైలుకు తరలించారు. చంచల్ గూడ జైలు దగ్గరకు  అల్లు అర్జున్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి ఉద్రిక్తత చోటుచేసుకోకుండా భారీ భద్రతతో పోలీసులు అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. 

అల్లు అర్జున్ కేసులో  మరో వైపు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు.  అల్లు అర్జున్ కు 105,118 సెక్షన్ కేసులు వర్తించవని చెప్పింది.  అల్లు అర్జున్ కు కూడా జీవించే హక్కు ఉందని తెలిపింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు  దేశం విడిచి పెట్టి వెళ్లొద్దని హైకోర్టు షరతులు పెట్టింది. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రేవతి మృతిపై సానుభూతి ఉందన్న కోర్టు..నేరం ఒక్కడిపైనే రుద్దడం కరెక్ట్ కాదని తెలిపింది.

 అయితే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే లోపే అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులోకి వెళ్లిపోయారు. మరి అల్లు అర్జున్ జైల్లో ఉంటారా? రిలీజ్ అవుతారా? అనేది ఉత్కంఠగా మారింది. 

ALSO READ : ఆరు అంటే 6 గంటల్లో.. ఇంట్లో నుంచి జైలుకు.. అల్లు అర్జున్ టైం లైన్ ఇలా..!

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను డిసెంబర్ 13న ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిక్కడ పల్లి పీఎస్ కు తరలించి అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేసి నాంపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రవేశ పెట్టారు. ఇరువురి వాదనల తర్వాత కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపటికే  హైకోర్టు అల్లు అర్జున్ కు షరతలతో కూడిన   మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది