చిక్కడపల్లి పీఎస్కు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో విచారణ ఎదుర్కొంటున్న నటుడు అల్లు అర్జున్ ఆదివారం ( జనవరి 5) చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు హాజరయ్యారు. ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరి నేరుగా పీఎస్ కు చేరుకున్నారు. అల్లు అర్జున్ పీఎస్ కు హాజరు కానుండటంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  

అల్లు అర్జున్ దాదాపు 12 నిమిషాల పాటు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. పోలీస్ స్టేషన్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లిపోయారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు.. ప్రతి ఆదివారం పీఎస్ కు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం పీఎస్ కు హాజరయ్యారు అల్లు అర్జున్.