పుష్ప అరెస్టు..తొక్కిసలాట ఘటనలో చంచల్​గూడ జైలుకు అల్లు అర్జున్​

  •  మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
  •  కేసులో అల్లు అర్జున్ ఏ-11.. అరెస్టు తర్వాత స్టేట్​మెంట్ రికార్డు
  • గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు.. నాంపల్లి కోర్టులో హాజరు 
  • 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు.. చంచల్ గూడ జైలుకు తరలింపు
  • హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్.. బెయిల్ మంజూరు
  • రిలీజ్ ఆర్డర్​లో ఆలస్యం.. ఆగిన విడుదల

హైదరాబాద్/జూబ్లీహిల్స్/ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు : సినీ నటుడు అల్లు అర్జున్​ను పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్​లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు పరిస్థితి సీరియస్​గా ఉంది. దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో అల్లు అర్జున్ ను ఏ11గా పేర్కొన్న పోలీసులు.. శుక్రవారం ఆయనను అరెస్టు చేశారు. అనంతరం చిక్కడపల్లిలోని పోలీస్ స్టేషన్​కు తరలించి విచారించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

ఇరువైపులా వాదనలు విన్న కోర్టు.. అల్లు అర్జున్​కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్​ను చంచల్​గూడ జైలుకు పోలీసులు తరలించారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో లంచ్ మోషన్​లో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం సహా అల్లు అర్జున్‌‌‌‌పై బీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ 105, 118(1) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు పెట్టారు.

థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓనర్లలో ఒకరైన సందీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా మరో ఇద్దరిని ఈ నెల 8న అరెస్ట్ చేశారు. తొక్కిసలాటకు బాధ్యుణ్ని చేస్తూ అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 11వ నిందితుడిగా చేర్చారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న సెక్షన్లన్నీ ఐదేండ్ల నుంచి పదేండ్ల వరకు శిక్షలు పడేవి కావడంతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్టు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగానే పోలీసులు అల్లు అర్జున్ నేరుగా అరెస్టు చేశారు.

భార్యకు ముద్దు.. పోలీసులకు వార్నింగ్ 

అల్లు అర్జున్​ను అరెస్టు చేసేందుకు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు బంజారాహిల్స్​లోని ఆయన ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెళ్లారు. ఆ టైమ్ లో అల్లు అర్జున్​గ్రీన్​కలర్​షర్ట్, షార్ట్​వేసుకుని లాన్​లో కూర్చున్నారు. విచారణ జరపాల్సి ఉందని, స్టేషన్​కు రావాలని పోలీసులు కోరగా.. డ్రెస్​మార్చుకుని వస్తానని అల్లు అర్జున్ బదులిచ్చారు. దీంతో ఆయన​వెంట బెడ్​రూమ్​వరకు పోలీసులు వెళ్లారు. దీనిపై అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొద్ది సేపటి తర్వాత వైట్​కలర్​హుడీ, వైట్​కలర్​ప్యాంట్​వేసుకుని బన్నీ బయటకు వచ్చారు. ఆ హుడీపై ‘ఫ్లవర్​నహీ..ఫైర్​హు మై’ (ఫ్లవర్ కాదు.. నేను ఫైర్) అని ఉంది. కిందికి వచ్చాక లాబీలో కొద్దిసేపు కాఫీ తాగిన అల్లు అర్జున్.. ​అక్కడే ఉన్న తన తండ్రి అల్లు అర్వింద్, తమ్ముడు అల్లు శిరీష్, భార్య స్నేహారెడ్డితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా తన భార్య చెంపపై ముద్దు పెట్టి ‘ఏమీ కాదు.. వచ్చేస్తా’ అంటూ ధైర్యం చెప్పారు. అదే టైమ్ లో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.

ALSO READ : బట్టలు మార్చుకోవడానికి అల్లు అర్జున్‎కు టైమ్ ఇచ్చాం: పోలీసుల వివరణ

‘‘ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటికి రావడమేంటి? డ్రెస్​మార్చుకునే టైమ్ కూడా ఇవ్వరా? బెడ్​రూమ్ వరకు వచ్చేస్తారా?. ఇది మంచిది కాదు. నేను రాను అని చెప్పడం లేదు కదా? ఇంత మంది పోలీసులు ఎందుకు? ఒకరో ఇద్దరో రావాల్సింది. నా కుటుంబసభ్యులు కంగారు పడుతున్నారు’’ అని అన్నారు. కాగా, అల్లు అర్జున్​కాఫీ తాగాక తమ వాహనంలో రావాలని పోలీసులు కోరారు. దీంతో ఆయన పోలీస్ వెహికల్ ఎక్కుతుండగా, అల్లు అర్వింద్ కూడా తాను వస్తానని చెప్పారు. అయితే వద్దు అని అల్లు అర్జున్ వారించారు. వేరే వాహనంలో రావాలని సూచించారు. ‘మంచి అయినా.. చెడు అయినా.. నేనే చూసుకుంట’ అని తండ్రితో అన్నారు. దీంతో అల్లు అర్వింద్, శిరీష్​ వేరో కారులో పోలీసుల వాహనం వెంట వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్​అరెస్ట్​సందర్భంగా ఆయన​ఇంటికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా జూబ్లీహిల్స్​పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, అల్లు కుటుంబసభ్యులను మాత్రమే అనుమతించారు. 

రెండు గంటలు విచారించి స్టేట్ మెంట్ రికార్డు.. 

అల్లు అర్జున్ ను బంజారాహిల్స్​లోని ఇంటి నుంచి చిక్కడపల్లిలోని స్టేషన్ కు పోలీసులు తరలించారు. స్టేషన్​లోపలికి ఎవరూ రాకుండా గేట్లు మూసేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు పీఎస్​కు తీసుకొచ్చిన పోలీసులు.. 2:11 గంటల వరకు విచారించారు. సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది? ఓపెన్ రూఫ్​కారులో ర్యాలీ తీస్తూ రావడం వల్లే తొక్కిసలాట జరిగింది కదా? దీనికి పర్మిషన్​ఎందుకు తీసుకోలేదు? అంటూ పలు ప్రశ్నలు అడిగారు. దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ.. ఈ నెల 2వ తేదీనే థియేటర్​యాజమాన్యం అనుమతి కోసం ఏసీపీకి దరఖాస్తు చేసిందని జవాబు ఇచ్చారు. ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా ప్రశ్నలు అడిగి అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన పోలీసులు.. కన్ ఫెషన్ స్టేట్ మెంట్ పై ఆయన సంతకం తీసుకున్నారు.

కాగా, విచారణ అనంతరం అల్లు అర్జున్ ను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం 2:19 గంటలకు గాంధీకి తీసుకొచ్చి, నేరుగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడే పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. గాంధీ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజకుమారి నేతృత్వంలో టెస్టులు చేశారు. అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో మధ్యాహ్నం 2.53 గంటలకు ఆయనను నాంపల్లి కోర్టుకు తరలించారు. 

అల్లు ఇంటికి చిరు

అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఆయన ఇంటికి పలువురు సినీ నటులు వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, నాగబాబు, రానా, డైరెక్టర్లు సుకుమార్, రాఘవేంద్రరావు తదితరులు వచ్చారు.

థియేటర్ నిర్వాహకులు మమ్మల్ని కల్వలేదు..  

బెనిఫిట్ షోకు సంబంధించి ఆర్గనైజర్లు పోలీస్ అధికారులను కలువలేదు. కేవలం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వెళ్లిపోయారు. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చే వరకు పరిస్థితి అదుపులోనే ఉంది. ఆయన థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు వచ్చిన తర్వాత తన ఓపెన్ రూఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ క్రమంలోనే అభిమానులు మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు ఒక్కసారిగా పరుగులు తీశారు. దీంతో అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రైవేట్ సెక్యూరిటీ ఆయనను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కాకపోవడంతో దాదాపు రెండు గంటల పాటు థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు పరిస్థితి విషమంగా ఉంది.

అరెస్ట్ సమయంలో పోలీసులు మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిహేవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారనేది అబద్ధం. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బట్టలు మార్చుకోవడానికి సమయం ఇచ్చాం. ఆయన బెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి బట్టలు మార్చుకున్నారు. పోలీసులు బయట వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. అల్లు అర్జున్ బయటకు వచ్చిన తరువాత కస్టడీలోకి తీసుకున్నాం. పోలీసులు ఎవరితోనూ మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిహేవ్ చేయలేదు. ఫ్యామిలీతో మాట్లాడేందుకు ఆయనకు సమయం ఇచ్చాం. అల్లు అర్జున్ తనంతట తానే వచ్చి పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కాడు.   అక్షాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీసీపీ, సెంట్రల్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

నాంపల్లి కోర్టులో వాడివేడి వాదనలు..  

నాంపల్లిలోని 9వ అదనపు మెట్రోపాలిటన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేజిస్ట్రేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు అల్లు అర్జున్ ను పోలీసులు ప్రొడ్యూస్ చేశారు. ముందుగా జడ్జి చాంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయనను ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పటికీ, అప్పటికే జడ్జి బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి వెళ్లడంతో ఓపెన్ కోర్టులోనే హాజరుపరిచారు. ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా గాంధీ హాస్పిటల్ డాక్టర్లు ఇచ్చిన హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరీ కోర్టుకు సమర్పించారు. సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద జరిగిన తొక్కిసలాట గురించి వివరించారు. పోలీసుల తరఫున పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్ వాదనలు వినించారు. ‘‘బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షోకు సంబంధించి థియేటర్ నిర్వాహకులు పోలీసులకు కేవలం లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే అందించారు. పోలీస్ అధికారులను కలవకుండా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చి వెళ్లిపోయారు. ఎలాంటి బందోబస్తు అవసరం ఉంటుందో కూడా స్థానిక డీసీపీ, ఏసీపీ, ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారం ఇవ్వలేదు.

ALSO READ : Allu Arjun case : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

ఈ క్రమంలోనే  థియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అభిమానులను నియంత్రించడంలో సమస్య తలెత్తింది. తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటనకు అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా బాధ్యుడే” అని వాదించారు. నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిలబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించాలని కోరారు. పీపీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జడ్జి.. అల్లు అర్జున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు 14 రోజుల రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధించింది. దీంతో పోలీసులు సాయంత్రం 5గంటలకు ఆయనను చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించారు. 

రాత్రంతా జైల్లోనే.. 

హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ, రిలీజ్ ఆర్డర్ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. శనివారం ఉదయం 7గంటల తర్వాతే ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ విడుదల కోసం చంచల్ గూడ జైలు వద్దనే ఆయన తండ్రి అల్లు అర్వింద్ సహా కుటుంబసభ్యులు వేచి చూశారు. చివరకు విడుదల కాడని తెలిసి రాత్రి 11:30 గంటలకు క్యాబ్ బుక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి క్లాస్ 1 మంజీరా బ్యారక్‌‌‌‌ ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదలవుతారని అందరూ భావించారు. కానీ అప్పటికి వెబ్ సైట్ లో హైకోర్టు ఆర్డర్​కాపీ అప్​లోడ్ ​కాలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత అప్ లోడ్ అయింది. దాన్ని అడ్వకేట్లు జైలు అధికారులకు చూపిస్తే అంగీకరించలేదు.

జడ్జి స్టాంప్, సంతకంతో ఫిజికల్​ కాపీ ఉండాలని స్పష్టం చేశారు. దీంతో అల్లు అర్జున్ ​లీగల్ టీమ్​ రాత్రి 10:20 గంటలకు ఫిజికల్​కాపీతో జైలుకు రాగా, అప్పటికే టైమ్ అయిపోయిందని అధికారులు తెలిపారు. సాధారణ కేసులో సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తామని, ప్రత్యేక కేసుల్లో గంట సడలింపు ఉంటుందని.. కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని, శనివారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

ఫ్లవర్ కాదు..ఫైర్

అరెస్టయిన టైమ్ లో కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ ప్రమోషనల్ టీషర్టు వేసుకున్నారు. డ్రెస్ మార్చుకుంటానని పోలీసులకు చెప్పిన ఆయన.. బెడ్ రూమ్​లోకి వెళ్లి ‘ఫ్లవర్​ నహీ..ఫైర్​ హు మై’ (ఫ్లవర్ కాదు.. నేను ఫైర్) అని రాసి ఉన్న వైట్ కలర్ హుడీ వేసుకుని బయటకు వచ్చారు.

అల్లు అర్జున్​ అరెస్టుపై రియాక్షన్స్

ఇది మనందరి తప్పు.. 

సంధ్య థియేటర్ వద్ద జరిగిన​ఘటనలో మనందరి తప్పు ఉంది. ఈ ఘటన నుంచి మనమందరం పాఠాలు నేర్చుకొని.. ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. కానీ, ఈ ఘటనలో ఒక్కరినే టార్గెట్ చేయడం సరికాదు. సినిమా వాళ్లనగానే ప్రభుత్వ అధికారులు, మీడియా వాళ్లు చూపించే ఉత్సాహం.. సాధారణ ప్రజల విషయంలోనూ ఉండాలి.

– నాని, సినీ నటుడు 

గుండె తరుక్కుపోతుంది..​

ఈ సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. భవిష్యత్తులో ఇలాంటివి ఎలా నిరోధించాలో ఆలోచించాలి. ఇలాంటి చర్యల వల్ల తప్పులు జరగకుండా ఉండవు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఆపలేము. అందరూ కలిసి పరిష్కార మార్గం కనుగొనాలి.

– నితిన్, సినీ నటుడు 

నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికీ ఉండదు..

సినీ నటులను వేధించాలని ఏ ప్రభుత్వానికీ ఉండదు. సంధ్య థియేటర్​ఘటనలో ప్రభుత్వ పక్షపాతం ఎక్కడుంది. ఏదో ఒక ప్రోద్బలంతో ఒక మూవీ హీరోని, సెలబ్రిటీలు, ఆర్టిస్టులను వేధించాలని, ఏదో కష్టం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ కి ఉన్నదనే ఆరోపణ ఇక్కడ అవాస్తవం. చట్టం ప్రకారం, బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుల అనుసారం కేసు ఫైల్​అయింది. పోలీసుల కార్యాచరణ, కోర్టు విచారణ తర్వాత బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విడుదల వంటివి జరిగాయి.

– విజయశాంతి, మాజీ ఎంపీ, సినీనటి