హీరో అల్లు అర్జున్ అరెస్టు విషయం హీరోలకు గుణపాఠం అయ్యేలా ఉంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. బెనిఫిట్ షోలకు లేదా పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లే ముందు పర్మీషన్ తీసుకోకపోతే ఏం జరుగుతుందో అల్లు అర్జున్ విషయంలో స్పష్టం అయ్యింది. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడంతో ఇక నుంచి మిగతా హీరోలకు ఇది ఓ లెస్సెన్ గా ఉండనుంది. ఇక నుంచి పర్మీషన్ తీసుకున్న తర్వాతే సెలెబ్రిటీలు బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read :- గాంధీ ఆస్పత్రిలో భారీ బందోస్తు
అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సాధారణ థియేటర్ లోకి వస్తున్నపుడు ముందస్తు సమాచారం ఇవ్వడం తప్పనిసరి. కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేనదని పోలీసులు చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఉంటే ఈ ఘటన జరిగేది కాదని, భద్రతా పరమైన చర్యలు తీసుకునే వాళ్లమని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వలన జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు హీరోపై కేసులు నమోదు చేశారు.
- కాంపెన్సేషన్ ఇచ్చినా..
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించి ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటానని ప్రకటించి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినా లాభం లేకుండా పోయింది. ఘటన జరిగిన తర్వాత జాలి చూపడం కంటే ముందే జాగ్రత్త చర్యలు తీసుకొని ఉంటే ఒక కుటుంబం రోడ్డున పడేది కాదు. అందుకే ఈ విషయాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. భవిష్యత్తులో మరే హీరో అయినా ముందే పర్మిషన్ తీసుకునేలా ఈ కేసుల ద్వారా హెచ్చరికలు పంపారు.