ఇంకా ఉంది: 2 కీలక కేసుల్లో విచారణ వాయిదా

  • ఫార్ములా –ఈ కేసులో ఏసీబీ కౌంటర్
  • కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ 31కి వాయిదా వేసిన హైకోర్టు
  • పుష్ప బెయిల్ పిటిషన్ పై కౌంటర్ వేసేందుకు టైం అడిగిన పోలీసులు
  • విచారణ ఈ నెల 30కి పోస్ట్ పోన్ చేసిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్: రెండు కీలక కేసుల విచారణ ఇవాళ వాయిదా పడింది. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఏ1గా, సీనియర్  ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ2గా, ఇంజినీర్ బీఎల్ ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హెచ్ఎండీఏ కమిషనర్ దానకిషోర్ స్టేట్మెంట్ సైతం ఏసీబీ రికార్డు చేసింది.

అయితే ఈ కేసులో తనను రాజకీయ కక్షతో ఇరికించారని పేర్కొంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇవాళ కేసు విచారణకు రాగా ఏసీబీ అధికారులు పూర్త వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దంటూ సూచించింది.

వర్చువల్ గా హాజరైన పుష్ప

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారన ఈ నెల 30కి వాయిదా పడింది. ఇవాళ్టితో ఆయన 14  రోజుల రిమాండ్ గడువు ముగిసింది.

ALSO READ | కరీంనగర్ పట్టభద్రుల స్థానం నుంచి బీఆర్ఎస్ పోటీ డౌటే!..

దీంతో ఆయన వర్చువల్ గా( వీడియో కాన్ఫరెన్సు ద్వారా) విచారణకు హాజరయ్యారు. బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పోలీసులు కోరడంతో ఈ  నెల 30వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.