సంధ్య థియేటర్ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ చాలా బాధకు లోనయ్యాడని అల్లు అరవింద్ అన్నారు. రేవతి అనే మహిళ చనిపోయిందని తెలిసి, శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసి ఏ సెలబ్రేషన్స్ కు కూడా వెళ్లడం లేదని, ఇంట్లో ఎక్కడో ఓ మూలకు ఒక్కడే కూర్చుని బాధపడుతున్నాడని తెలిపారు. అల్లు అర్జున్ ను ఈ స్థితిలో చూస్తే బాధేస్తుందని అన్నారు.
శ్రీతేజ్ విషయంలో బాధ్యత లేదని అంటున్నారని, శ్రీతేజ్ కుటుంబానికి ఆదుకోవడానికి తాము చర్చించి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్, థియేటర్ యాజమాన్యం, తాము మనీ కలెక్ట్ చేసి సహాయం చేద్దామని అనుకున్నామని.. ఆ విషయం చెపుదామని అంటే.. ఇది సమయం కాదని బన్నీ అన్నారని తెలిపారు. అది మరో సందర్భంలో చెప్తామని అన్నారు.
ALSO READ | Allu Arjun: కన్నీళ్లు పెట్టుకున్న అల్లు అర్జున్
‘‘ప్రజల అభిమానంతో వచ్చిన వాళ్లం .. మాపైన ఎవరో ఏదో మాట్లాడితే బాధ వేసింది..’’. తప్పుడు ప్రచారం జరుగుతోందని దానిపై క్లారిటీ ఇవ్వడానికే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారని తెలిపారు.