ఆక్స్‌ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతివ్వండి

ఆక్స్‌ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతివ్వండి

పుణే : ఆక్స్‌ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌‌ను ఫేస్ 2/3 హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)ను సిరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌ఐఐ) కోరుతోంది . ఆస్ట్రాజెనెకాతో కలిసి సిరమ్ ఇన్‌‌స్టిట్యూ ట్ ఆక్స్‌ ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేస్తోంది . ‘కోవిషీల్డ్’ ట్రయల్స్ చేపట్టేం దుకు డీసీజీఐ నుంచి అనుమతి కోరుతూ పుణేకు చెందిన ఈ డ్రగ్ సంస్థ అప్లికేషన్‌‌ను దాఖలు చేసింది . ఈ అప్లికేషన్ ప్రకారం, ఆరోగ్యంగా ఉన్న వారిలో ‘కోవిషీల్డ్’ సేఫ్టీ, రోగ నిరోధక శక్తిని గుర్తించేందుకు స్టడీని చేపడుతుంది.

18 ఏళ్లు పైబడిన 1600 మంది మా స్టడీలో పాల్గొనేందుకు ఎన్‌‌రోల్ చేసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. తొలి రెండు దశల ట్రయల్స్‌ ను యూకేలోని ఐదు ట్రయల్ సైట్లలో చేపట్టారు. ఈ ట్రయల్స్ ఫలితాల్లో సేఫ్టీ ప్రొఫైల్ ఆమోదించదగ్గ విధంగా ఉందని, యాంటీ బాడీ రెస్పాన్స్ పెరిగిందని పేర్కొన్నాయి. ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తోన్న ఈ వ్యాక్సిన్‌‌ను ప్రవేశపెట్టేందుకు సిరమ్ ఇన్‌‌స్టిట్యూ ట్ బ్రిటీష్ స్విడీష్ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనాకాతో కోలాబరేషన్ అయింది . ఆస్ట్రాజెనెకాతో మాన్యుఫాక్చరింగ్ పార్టనర్‌‌‌‌షిప్ కుదుర్చుకున్నట్టు సిరమ్ ఇన్‌‌స్టిట్యూ ట్ సీఈవో అదార్ పూనావాలా అన్నారు. ఆక్స్‌ ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తోన్న ఈ వ్యాక్సిన్‌‌ను 100 కోట్ల డోస్‌‌లను ప్రొడ్యూస్ చేసి, సప్లై చేస్తుంది. ఆగస్ట్‌‌లో కంపెనీ ఫేస్ 2,3 హ్యుమన్ ట్రయల్స్‌ ను చేపట్టనుంది.