Allah Ghazanfar: ఈ రికార్డ్ చెరగనిది: మూడు రోజుల్లో నాలుగు మ్యాచ్‌లాడిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్

ప్రపంచ క్రికెట్ లో సాధారణంగా ఒక మ్యాచ్ ఆడితే ఖచ్చితంగా రెండో మ్యాచ్ ఆడడానికి రెస్ట్ తప్పనిసరి. కొన్నిసార్లు వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్ లు కూడా ఆడాల్సి రావొచ్చు. కానీ ఆఫ్గనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో అత్యంత బిజీ క్రికెటర్ గా మారాడు. అతడు మూడు రోజుల వ్యవధిలో నాలుగు మ్యాచ్ లు ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.  

ప్రస్తుతం అండర్ 19 ఆసియా కప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో అబుదాబి టీ10 లీగ్ జరుగుతోంది. ఈ రెండు జట్లలో అల్లా ఘజన్‌ఫర్  కీలక ప్లేయర్. శుక్రవారం (నవంబర్ 29) ఆసియా కప్ లో మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత రోజు సాయంత్రం అబుదాబి టీ10 లీగ్ లో కనిపించాడు. ఆదివారం (నవంబర్ 30) ఏకంగా రెండు మ్యాచ్ లాడాడు. ఉదయాన్నే ఆసియా కప్ లో మ్యాచ్.. అదే రోజు సాయంత్రం అబుదాబి టీ10 లీగ్ లో ఆడాడు. ఆదివారం ఉదయం షార్జాలో మ్యాచ్ ఆడి.. ఆ తర్వాత దుబాయ్ వచ్చి మ్యాచ్ ఆడడం విశేషం. 

Also Read : ప్రాక్టీస్ మ్యాచ్‌లో కనిపించని కోహ్లీ, బుమ్రా, పంత్

అల్లా ఘజన్‌ఫర్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ.4.80 కోట్ల ధర పలికాడు. రూ. 4.80 కోట్లకు ఘజన్‌ఫర్‌ను ముంబై దక్కించుకుంది. కనీస ధర రూ. రూ.75 లక్షలతో వేలంలోకి వచ్సిన ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. అయితే ధర రూ. 2 కోట్లు పైబడగానే బెంగళూరు వెనక్కి తగ్గగా.. ముంబై రేసులోకి వచ్చింది. దీంతో ముంబై జట్టుకు ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ వెళ్ళిపోయాడు. అల్లా ఘజన్‌ఫర్ గతంలో 2023, 2024 సీజన్లలో వేలం కోసం తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ, రెండింటిలోనూ అమ్ముడుపోలేదు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)