Barack Obama: అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా 2024లో తన ఫెవరెట్ సినిమాల లిస్ట్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాల లిస్ట్ టాప్ లో మలయాళ సినిమా "ఆల్ వి ఇమాజిన్ యాస్ లైట్" ఉంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చినియాంశంగా మారింది.
ఈ సినిమాకి హిందీ సినీ దర్శకురాలు పాయల్ కపాడియా దర్శకత్వం వహించింది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకి ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు లభించింది. ఈ సినిమా క్యాస్ట్ & క్రూ విషయానికొస్తే మలయాళ ప్రముఖ నటీనటులు కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదం, హృదు హరూన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. మలయాళం, మరాఠీ, హిందీ భాషల్లో భారత్ తోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ మరియు ఇటలీ తదితర దేశాలలో రిలీజ్ చెయ్యగా వరల్డ్ వైడ్ 1.09 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది.
ఈ సినిమాల లిస్ట్ ని షేర్ చేస్తూ ప్రముఖ తెలుగు హీరో, నిర్మాత రానా దగ్గుబాటి సోషల్ మీడియాలో స్పందించాడు. ఇందులో భాగంగా "ఆల్ వి ఇమాజిన్ యాస్ లైట్" చిత్ర యూనిట్ ని అభినందించాడు. అలాగే దిస్ ఈజ్ కూల్ అంటూ దర్శకురాలు పాయల్ కపాడియా, బరాక్ ఒబామా ఐడీలని ట్యాగ్ చేశాడు. దీంతో అభిమానులు స్పందిస్తూ భారతీయ సినిమాలకి ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు లభించడం గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే కంటెంట్ ఉన్న సినిమాలకి బడ్జెట్ తో పనిలేదని బోర్డర్స్ దాటి ఫెర్ఫార్మ్ చేస్తాయని ఈ సినిమా నిరూపించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బరాక్ ఒబామ ఫెవెరెట్ సినిమాల లిస్ట్ లో కాన్క్లేవ్, ది పియానో లెస్సన్, ది ప్రామిస్డ్ ల్యాండ్, ది సీడ్ ఆఫ్ ది సాక్రేడ్ ఫిగ్, ద్యూన్: పార్ట్ 2, అనోరా, దిది, షుగర్ కేన్, ఏ కంప్లీట్ అన్ నోన్, తదితర సినిమాలు ఉన్నాయి.
This is so cool ? ?#AllWeImagineAsLight #PayalKapadia ❤️@BarackObama ✨✨ pic.twitter.com/Lmf64D4RzA
— Rana Daggubati (@RanaDaggubati) December 21, 2024