ఈనెల 15న చంద్రయాన్ -2 ప్రయోగం జరగనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరక్ష ప్రయోగ కేంద్రం (షార్) రెండో ప్రయోగ వేదికకు GSLV-మార్క్ 3 చేరింది. ఈ శాటిలైట్ లాంచింగ్ వెహికల్… చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది.
వారం రోజుల పాటు ఈ ప్రయోగవేదికపై లాంచింగ్ వెహికల్ కు పరీక్షలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే షార్‌లో వేగంగా జరుగుతున్నాయి.
