యూపీలో ముగిసిన ఈసీ పర్యటన

యూపీలో ముగిసిన ఈసీ పర్యటన

ఉత్తర్ ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన ముగిసింది. మూడు రోజుల పాటు యూపీలో ఈసీ బృందం పర్యటన కొనసాగింది. ఈ సందర్భంగా సభ్యులు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని పార్టీలు కూడా ఎన్నికలు నిర్వహించాలని కోరాయని అధికారులు పేర్కొన్నారు. యూపీతో పాటు, పంజాబ్, గోవా,ఉత్తరా ఖండ్,మణిపూర్ లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారం యూపీలో ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తూ ఎన్నికలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 

ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, ఈసీఐ సీనియర్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకూ అన్ని జాతీయ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయలను తెలుసుకున్నారు. యూపీలో ఎన్నికల సంసిద్ధతను సమీక్షించేందుకు ఈసీఐ బృందం మూడు రోజుల పర్యటనలో భాగంగా యూపీ లక్నోలో ఉంది.

ఇవి కూడా చదవండి:

ముంబై ఎస్బీఐ బ్యాంకులో కాల్పులు.. ఒకరు మృతి

అనంత్ నాగ్ ఎన్ కౌంటర్.. టెర్రరిస్టులు హతం