- ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మాదాపూర్, వెలుగు : మాదాపూర్ శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళా మొదలైంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్గవర్నమెంట్ఆఫ్ఇండియా, నేషనల్జ్యూట్బోర్డు ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేయగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. చేనేత కళాకారుల ఉత్పత్తులను సందర్శించారు. ఆ తర్వాత శిల్పారామంలో ని బృందావనాన్ని తిలకించారు. యేటా డిసెంబర్15 నుంచి 31 వరకు ఆల్ ఇండియా క్రాఫ్ట్‌మేళా నిర్వహిస్తున్నట్లు శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు తెలిపారు.
ఈసారి దేశంలోని 20 రాష్ట్రల నుంచి వచ్చిన చేనేత కళాకారులు ఉత్పత్తులతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. చేనేత ఉత్పత్తులకి సంబంధించి 100 స్టాళ్లు, జ్యూట్ ఉత్పత్తులకు సంబంధించి 31 స్టాళ్లు కొలువుదీరాయి. శిల్పారామం ఆధ్వర్యంలో చేనేత హస్తకళల ఉత్పత్తులకు సంబంధించి 300 పైగా స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో గద్వాల్, పోచంపల్లి, మంగళగిరి, నారాయణపేట, కోట డోరియా, చందేరి జాంధానీ,పైతాని, పటోళ్ల చీరలు
కాటన్ అద్దకం చీరలు, చద్దర్లు, వరంగల్ కార్పెట్లు, పష్మీనా శాలువాలు, శ్రీకాళహస్తి చెక్క విగ్రహాలు, జ్యూట్ బ్యాగ్లు, మట్టి కుండలు అమ్మకానికి పెట్టారు. దుబాయ్, కెనడా వంటి దేశాల నుంచి కళాకారులు పాల్గొంటున్నారు.