పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ముగ్గురు - మోడీ ఏం చెప్పబోతున్నాడు..?

2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజాగళం సభను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాయి. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత నిర్వహిస్తున్న సభ కావటం, పదేళ్ల తర్వాత చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికపై కలుస్తున్న నేపథ్యంలో ఈ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట నిర్వహిస్తున్న ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

300 ఎకరాల్లో నిర్వహిస్తున్న ఈ సభ కోసం 7 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు.ఇదిలా ఉండగా, ఈ సభలో మోడీ ప్రసంగంపై అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సభలో మోడీ ఎన్డీయే తరఫున రాష్ట్రానికి ఏ హామీలు ఇస్తారు, కూటమి నుండి ఏ సందేశాన్ని ఇస్తారు,  జగన్ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సాధిస్తారా లేదా అన్నది ఆసక్తి నెలకొంది. మరి, పది లక్షల మంది జనం వస్తారని ప్లాన్ చేసిన ఈ ప్రజాగళం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.