యాక్టర్ అలీ ఎంపీనా.. ఎమ్మెల్యేగానా పోటీ చేసేది..!

2024 ఎన్నికల్లో కమెడియన్ అలీ పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా వ్యవహరిస్తున్న అలీని వచ్చే ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి బరిలో దింపాలని జగన్ డిసైడ్ అయ్యాడట. 2019 ఎన్నికల్లోనే అలీ పోటీ చేయాలని ఆశించినప్పటికీ సీటు దక్కలేదు. ప్రభుత్వం వచ్చాక రాజ్యసభ సీటు లేదా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి ఇవ్వలేకపోయిన జగన్ సలహాదారుడిగా నియమించారు. ఈ ఎన్నికల్లో అలీ రాజమండ్రి నుండి టికెట్ ఆశించగా జగన్ నంద్యాల బరిలో దింపాలని డిసైడ్ అయ్యాడు.

నంద్యాల ప్రాంతంలో ముస్లిం జనాభ ఎక్కువ ఉండటమే అలీని నంద్యాల బరిలో దింపటానికి గల కారణం అని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ చాలా మందిని ఒకచోట నుండి ఇంకో చోటకు ట్రాన్స్ఫర్ చేసాడు. త్వరలో ప్రకటించబోయే లిస్ట్ లో అలీతో పాటు మరికొంత మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని సమాచారం.

క్యాడర్ కి ' వై నాట్ 175 ' అంటూ టార్గెట్ పెట్టిన జగన్ సిద్ధం పేరిట వరుస బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అన్ని పార్టీలకంటే ముందే అభ్యర్థుల జాబితా ప్రకటించిన జగన్ టీడీపీ, జనసేన కూటమికి చెక్ పెట్టే విధంగా వేగంగా పావులు కదుపుతున్నారు. నంద్యాల పార్లమెంట్ బరిలో అలీని దింపాలన్న జగన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి.