లిఫ్ట్​కు ఇబ్బంది ఏర్పడితే టెక్నీషియన్లకు అలర్ట్స్​ వెళ్తాయి

లిఫ్ట్​కు ఇబ్బంది ఏర్పడితే టెక్నీషియన్లకు అలర్ట్స్​ వెళ్తాయి

హైదరాబాద్​, వెలుగు: లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ఎస్కలేటర్ల తయారీ కంపెనీ జాన్సన్​ లిఫ్ట్స్​ ఇంటర్నెట్​ ఆఫ్​ థింగ్స్​ ఆధారిత ‘వాచ్‌‌‌‌‌‌‌‌’ టెక్నాలజీని తన ప్రొడక్టుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఇది ఐఓటీ ఆధారిత వైర్‌‌‌‌‌‌‌‌లెస్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ డివైజ్​. అవసరం వచ్చినప్పుడు కస్టమర్లకు,టెక్నీషియన్లకు సూచనలను ఇస్తుంది. పరిస్థితులను మానిటర్ చేస్తూ ఆపద సమయంలో హెచ్చరిస్తుంది. లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి సేకరించిన సమాచారాన్ని వాచ్ (వైర్‌‌‌‌‌‌‌‌లెస్ అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫర్​ చానెలైజ్ & హోస్ట్ ట్రబుల్​ షూట్) డేటా సెంటర్‌‌‌‌‌‌‌‌కు పంపుతుంది. దీనివల్ల రియల్​టైం మానిటరింగ్​ సాధ్యపడుతుంది. ఫలితంగా ఆపద సమయాల్లో కస్టమర్లు తక్షణ సహాయం పొందవచ్చు. అంతేగాక లిఫ్ట్​కు ఇబ్బంది ఏర్పడితే టెక్నీషియన్లకు అలర్ట్స్​ వెళ్తాయి.