JOB NEWS: ఆర్మీలో ట్రేడ్స్‌‌మ్యాన్‌‌, ఫైర్‌‌మ్యాన్‌‌ పోస్టులు.. క్వాలిఫికేషన్ ఏంటంటే..?

సెంట్రల్ రిక్రూట్‌‌మెంట్ సెల్, ఆర్మీ ఆర్డ్‌‌నెన్స్ కార్ప్స్ సెంటర్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లలో ట్రేడ్స్‌‌మ్యాన్‌‌ మేట్‌‌, ఫైర్‌‌మ్యాన్‌‌ ఖాళీల భర్తీకి ఆన్‌‌లైన్‌‌ అప్లికేషన్స్​ కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌‌ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌‌ 22వ తేదీలోగా ఆన్‌‌లైన్‌‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

అర్హతలు: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటీఐ, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణత, టైపింగ్ నాలెడ్జ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు పోస్టును బట్టి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.  

సెలెక్షన్​: ఫిజికల్‌‌ ఎండ్యూరెన్స్‌‌/ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, సర్టిఫికేట్​ వెరిఫికేషన్​, మెడికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.aocrecruitment.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.