పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఓపెనర్ యశస్వి జైశ్వాల్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్టార్క్ ను స్లెడ్జింగ్ చేశాడు. స్టార్క్ వేసిన ఓవర్లో తొలి మూడు బంతుల్లో ఒక బౌండరీతో సహా జైశ్వాల్ ఏడు పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత రెండు బంతులు మిస్ అవ్వడంతో వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లాయి. ఈ ఓవర్ లో స్టార్క్ వైపు చూస్తూ నీ బంతి చాలా స్లో గా వస్తుంది అని జైశ్వాల్ అన్నాడు. దీనికి స్టార్క్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఒక యంగ్ టీమిండియా బ్యాటర్ ఇలా ఆసీస్ బౌలర్ పై సెటైర్ వేయడం షాక్ కు గురి చేసింది.
స్టార్క్ లాంటి ఫాస్ట్ బౌలర్ ను జైశ్వాల్ స్లెడ్జింగ్ చేయడంతో ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ అలిస్టర్ కుక్ షాకయ్యాడు. జైశ్వాల్ ను ప్రశంసిస్తూ అతడి ఆడిన 161 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ను ప్రశంసించాడు. కుక్ మాట్లాడుతూ " స్టార్క్ ఒకవేళ స్లో గా బాల్స్ వేసినా నేను నోరు మూసుకొని ఉండేవాడిని. కానీ 22 ఏళ్ళ జైశ్వాల్ కాన్ఫిడెన్స్ మాత్రం అద్భుతం. 15 టెస్టుల్లో జైశ్వాల్ నిలకడ అత్యద్భుతం. ఆస్ట్రేలియా లాంటి ఛాలెంజ్ పిచ్ పై పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు". అని ఈ ఇంగ్లాండ్ దిగ్గజం అన్నాడు.
ALSO READ :AUS vs IND: నమ్మకం లేనట్టే కనిపిస్తుంది: తుది జట్టులో స్థానంపై సందేహం వ్యక్తం చేసిన రాహుల్
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆస్ట్రేలియా ఒత్తిడిలో కనిపిస్తుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకం. మరోవైపు తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం ఖాయమైంది. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి రెండో టెస్ట్ జరగనుంది.
“I would have kept my mouth shut” ?
— CricXtasy (@CricXtasy) December 4, 2024
Alastair Cook impressed with the confidence of Yashasvi Jaiswal. ?? pic.twitter.com/eaiRhJCqXr