కేరళలో బర్డ్ ఫ్లూ అటాక్ .. రెండు జిల్లాల్లో అలర్ట్

కేరళలో బర్డ్ ఫ్లూ అటాక్ .. రెండు జిల్లాల్లో అలర్ట్
కేరళ, రాజస్థాన్ లను బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. కేరళలోని అలెప్పీ, కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా వేలాది బాతులు చనిపోతున్నాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాండ్ టీమ్స్ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాయి. గతవారమే అలెప్పీ, కొట్టాయం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలతో అనేక బాతులు చనిపోయాయి. దీంతో వాటి నుంచి శాంపిల్స్ తీసి భోపాల్ పంపించారు. అక్కడ కొన్ని శాంపిల్స్ లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ శాంపిల్స్ తీసిన ప్రాంతంలో ఒక కిలోమీటర్ రేడియస్ లో ఉన్న బాతులన్నింటిని చంపేసి పాతిపెట్టారు. మొత్తంగా అలెప్పీ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో 12వేల బాతులు చనిపోగా… వైరస్ వ్యాపించకుండా మరో 36వేలకు పైగా బాతులను చంపేసి పూడ్చిపెట్టారు. కేరళలో బీఫ్ తర్వాత బాతు మాంసమే ప్రామినెంట్ నాన్ వెజ్. 2016లోనూ బర్డ్ ఫ్లూ కారణంగా అలెప్పీ, పథనంతిట్ట జిల్లాల్లో 2లక్షలకు పైగా బాతులు, కోళ్లను పూడ్చేశారు. ప్రతీ ఏటా కేరళలలో బర్డ్ ఫ్లూ కనిపిస్తూనే ఉంది. దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక రాజస్థాన్ లో బర్డ్ ఫ్లూ కాకులపై ప్రభావం చూపిస్తోంది. గతవారం ఝలావఢ్ జిల్లాలో భారీగా కాకులు చనిపోయాయి. జిల్లాలోని రాడీ అనే ప్రాంతంలో బర్డ్ ఫ్లూ అనే కారణంగా వందలాది కాకులు మృత్యవాత పడ్డాయి. దీంతో రాడీలో 144 సెక్షన్ విధించారు జిల్లా అధికారులు. అయితే తర్వాత అనేక జిల్లాలకు బర్డ్ ఫ్లూ స్ప్రెడ్ అయింది. జైపూర్, జోధ్ పూర్, కోటా లాంటి సిటీల్లోనూ కాకులు చస్తున్నాయి. ఇవాళ్టి వరకు 252 కాకులు మాత్రమే చనిపోయాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని సమాచారం. అఫీషియల్ నెంబర్స్ ప్రకారం ఝలావఢ్ జిల్లాలో 100, బారన్ లో 72, కోటాలో 47, జైపూర్ లో 7, జోధ్ పూర్ లో 7 కాకులు చనిపోయాయి.