Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏ రాశి వారు ఏ వస్తువు కొనాలో తెలుసా..

అక్షయ తృతీయ రోజు హిందువులకు చాలా పవిత్రమైన రోజు.  ఈరోజు ( మే 10) లక్ష్మీదేవి, కుబేరునికి సంబంధించినరోజు.  ఆ రోజున  బంగారం లాంటి  విలువైన వస్తువులు కొనుగోలు చేయాలని చెబుతుంటారు.  అయితే పవిత్రమైన అక్షయ తృతీయ రోజు మీ రాశి ప్రకారం కొన్ని ఆహార పదార్థాలు దానం చేస్తే మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఏ రాశి జాతకులు ఏ వస్తువులు కొనుగోలు చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.

 హిందూ ధర్మశాస్త్రంలో అత్యంత పవిత్రమైన రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. మరి కొన్ని రోజుల్లో ( మే 10)  అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు.  ఆ రోజు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ శుభకార్యం నిర్వహించినా దాని ఫలితం అంతులేనిది. అక్షయ తృతీయ రోజు ముహూర్తాన్ని పరిగణలోకి తీసుకోకుండా పనులు చేస్తారు. బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని నమ్ముతారు. ఈ ఏడాది మే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ వచ్చింది. గజకేసరి యోగంతో పాటు అనేక శుభయోగాలతో అక్షయ తృతీయ జరుపుకోబోతున్నారు.  బంగారం, వెండి మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులు కూడా అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మేష రాశి : అక్షయ తృతీయ పర్వదినాన మేష రాశి జాతకులు పప్పు ధాన్యాలు కొనుగోలు చేయాలి. ఆ రోజున ( మే 10) పప్పు ధాన్యాలు కొనడం లేదా దానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. 

వృషభ రాశి : వృషభ రాశి జాతకులు అక్షయ తృతీయ రోజు బియ్యం, చిరుధాన్యాలు కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

మిథున రాశి: అక్షయ తృతీయ పర్వదినాన మిథున రాశి జాతకులు పెసరపప్పు, కొత్తిమీర కొనుగోలు చేయాలి ఇలా చేస్తే మీకు అంతా మంచే జరుగుతుంది. 

కర్కాటక రాశి: అక్షయ తృతీయ రోజు కర్కాటక రాశి వారు బియ్యం, పాలు వంటి తెలుపు రంగు ఆహార పదార్థాలు కొన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే మంచిది.

సింహ రాశి : సింహ రాశి వారు అక్షయ తృతీయ రోజు పండ్లు కొనుగోలు చేయాలి. ఈరోజు పండ్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు. 

కన్యా రాశి: కన్యా రాశి జాతకులు అక్షయ తృతీయ పర్వదినాన పెసరపప్పు కొనాలి. ఇలా  చేయడం వల్ల జీవితంలో సుఖశాంతులు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

తులా రాశి : తులా రాశి జాతకులు పంచదార, బియ్యం వంటివి కొనుగోలు చేస్తే మంచిది. ఈ పవిత్రమైన రోజున వీటిని కొన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి జాతకులు బెల్లం, నీళ్లు కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల పనుల్లో విజయం లభిస్తుందని నమ్ముతారు.

ధనుస్సు రాశి : అక్షయ తృతీయ రోజు ధనుస్సు రాశి వారు అరటి పండ్లు, బియ్యం కొనాలి. జ్యోతిష్య నిపుణుల సూచనల  ప్రకారం ఈరోజు వీటిని ఇంటికి తీసుకొస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది.

మకర రాశి: మకర రాశి జాతకులు పవిత్రమైన అక్షయ తృతీయ రోజు పప్పులు, పెరుగు కొనుగోలు చేయాలి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం లభిస్తుంది. 

కుంభ రాశి : కుంభ రాశి జాతకులు నువ్వులు కొనుగోలు చేయాలి. వీటిని ఇంటికి తీసుకురావడం వల్ల మీకు అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. 

మీన రాశి : మీనరాశి జాతకులు పసుపు, పప్పులు కొనుగోలు చేయాలి. ఇలా చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి