ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇప్పటి నుంచి ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. గెలుపు లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం సమాజ్ వాదీ అత్తర్‌ను ప్రారంభించారు. అత్తర్ బాటిల్స్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సెంట్ బాటిల్స్‌ను ఎరుపు, ఆకు పచ్చ రంగుల్లో తయారు చేశారు. అత్తరు సీసాకు ప్యాకేజ్ చేసిన ఆట్టపై అఖిలేశ్ యాదవ్ ఫోటోతో పాటు పార్టీ గుర్తు కూడా ముద్రించారు. బాటిల్ పై కూడా పార్టీ గుర్త సైకిల్‌ను ముద్రించారు. 22 రకాల నేచురల్స్‌తో ఈ సెంట్‌ను తయారు చేశారు.
2022 ఎన్నికల్లో ఈ అత్తరు తన మ్యాజిక్ చూపిస్తుందని’ అని అన్నారు అఖిలేశ్ యాదవ్.ఈ కార్యక్రమంలో సమాజ్ వాదీ పార్టీ లీడర్లు కన్నూజ్ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ కూడా పాల్గొన్నారు. జైన్ మాట్లాడుతూ.. ఎవరైతే ఈ సెంట్‌ను వాడుతారో వాళ్లు సోషలిజంను కూడా స్మెల్ చేస్తారని’ పేర్కొన్నారు. సమాజ్ వాదీ పార్టీకి ఈ చెందిన పరిమళం 2022లో ద్వేషాన్ని అంతం చేస్తుందని .. జైన్ జోస్యం చెప్పారు. అయితే సమాజ్ వాదీ పార్టీ సెంట్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే పార్టీకి చెందిన అత్తరును విడుదల చేశారు.
Lucknow: Samajwadi Party leader Akhilesh Yadav launches 'Samajwadi Attar'
— ANI UP (@ANINewsUP) November 9, 2021
"The perfume will end hatred in 2022," says SP MLC Pushpraj Jain at the launch pic.twitter.com/l0SQ11Gvt3
గతంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కూడా అఖిలేశ్ యాదవ్... పెర్‌ఫ్యూమ్‌ను లాంచ్ చేశారు. 2016లో ‘సమాజ్ వాదీ సుగంధ్’ పేరుతో సెంట్‌ను అప్పట్లో ఆయన విడుదల చేశారు. వివిధ రకాల ఫ్రాగ్రాన్స్‌లో దాదాపు 5000 బాటిల్స్ రిలీజ్ చేశారు. యూపీలో ప్రధానమైన ప్రాంతాలు, కట్టడాలు అయిన తాజ్ మహల్, బెనారస్ ఘాట్, రుమి దర్వాజ, కన్నౌజ్ పేరు మీదుగా ఆ సెంట్ బాటిళ్ల ని విడుదల చేశారు. నాలుగేళ్ల పాలనకు సూచికగా నాలుగు రకాల సెంట్లను ఆయన ప్రభుత్వం అప్పట్లో రాష్ట్ర ప్రజలకు పంపిణీ చేసింది.
