బెయిల్‌పై పోలీస్ మెమో
ఐపీసీ సెక్షన్ 395 తన పరిధిలోకి రాదన్న కోర్టు
పిటిషన్ వెనక్కి తీసుకొని నాంపల్లి కోర్టులో దాఖలు
భార్గవ్ రామ్ యాంటిసిపేటరీ, పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా
హైదరాబాద్, వెలుగు: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌ను సికింద్రాబాద్ కోర్ట్ రిటర్న్ చేసింది. అఖిలప్రియపై ఐపీసీ సెక్షన్395(బందిపోటు దోపిడీ) కింద అదనపు సెక్షన్ చేర్చినట్లు పోలీసులు సోమవారం కోర్టులో మెమో ఫైల్ చేశారు. దీంతో ఐపీసీ సెక్షన్ 395 విచారణ తమ పరిధిలోకి రాదంటూ పిటిషన్‌ను కోర్ట్ రిటర్న్ చేసింది. జీవితఖైదు సెక్షన్ అయినందున నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టులో బెయిల్ పిటిషన్ ఫైల్ చేయాలని సూచించింది. దీంతో డిఫెన్స్ లాయర్ నాంపల్లి ఎంఎస్‌జే కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. మంగళవారం నోటీసులు ఇచ్చిన తరువాత వాదనలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు
బోయిన్‌పల్లి పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితులపై సెక్షన్ 419, 341, 342, 452,506,365ఐపీసీతో పాటు దోపిడీకి చెందిన 395 సెక్షన్ కూడా రిజిస్టర్ చేసినట్లు వివరించారు. 25 మందితో కలిసి ప్రవీణ్‌రావు, సునీల్, నవీన్‌రావులను కిడ్నాప్ చేసి డాక్యుమెంట్స్ దోపిడీకి ప్లాన్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కిడ్నాప్ స్కెచ్ వేసిన అఖిలప్రియ భర్త భార్గవరామ్‌రెడ్డి, అనుచరుడు గుంటూరు శ్రీను, భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్, అఖిలప్రియ తమ్ముడు జగత్ విఖ్యాత్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాల్ రికార్డ్స్‌తో పాటు సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా అఖిలప్రియ మొబైల్ ఫోన్స్ సీజ్ చేసి అనాలసిస్ చెయ్యాల్సిన అవసరం ఉందని చెప్పారు.
.
