IND vs BAN 2024: కోహ్లీనే నాకు స్వయంగా బ్యాట్ ఇచ్చాడు.. ఆకాష్ దీప్ ఎమోషనల్

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఇటీవల చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌కు ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నుండి బ్యాట్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. ప్రీ-మ్యాచ్ శిక్షణా శిబిరంలో.. కోహ్లి తన దగ్గర ఉన్న బ్యాట్‌లలో ఒకదానిని ఆకాష్ దీప్‌కి స్వయంగా ఇవ్వడం విశేషం. కోహ్లీ, ఆకాష్ దీప్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడారు. తాజాగా కోహ్లీ ఇచ్చిన బ్యాట్ తనకెంత స్పెషల్ అనే విషయాన్ని ఆకాష్ దీప్ చెప్పుకొచ్చాడు. 

కోహ్లీని స్వయంగా తనకు బ్యాట్ ఇవ్వడంతో ఆకాష్ దీప్ ఎమోషనల్ అయ్యాడు. " కోహ్లీ నాకు స్వయంగా బ్యాట్ ఇచ్చాడు. నేను ఎప్పుడు బ్యాట్ ఇవ్వమని అడగలేదు. నేను అమితంగా ఆరాధించే క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. అతడి నుంచి బ్యాట్ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. కోహ్లీ ఇచ్చిన బ్యాట్ ను మ్యాచ్‌లో ఉపయోగించను. ఎందుకంటే ఇది కోహ్లీ నుండి నాకు ఒక ముఖ్యమైన బహుమతి". అని ఆకాష్ దీప్ అన్నాడు. 

ALSO READ | IND vs BAN 2024: బంగ్లాతో రెండో టెస్ట్.. సచిన్, బ్రాడ్‌మన్ రికార్డులపై కన్నేసిన కోహ్లీ

బుమ్రా స్థానంలో ఇంగ్లాండ్ తో ఈ ఏడాది ప్రారంభంలో టెస్ట్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు ఆకాష్ దీప్. తొలి సిరీస్ లోనే అద్భుతమైన బౌలింగ్ తో తనను తాను నిరూపించుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవలే బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో తన రెండో ఓవర్లోనే తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టాడు.