టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ను తుది జట్టులో తీసుకోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కుల్దీప్ లాంటి స్టార్ స్పిన్నర్ ను పక్కనపెట్టి ఈ బెంగాలీ పేసర్ కు అవకాశమివ్వడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన రెండో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లను తీశాడు. ఇన్నింగ్స్ 9 ఓవర్ తొలి బంతికి జాకీర్ హసన్ ను.. రెండో బంతికి మోమినల్ హక్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ దశలో హ్యాట్రిక్ మీద ఆశలు చిగురించిన రహీం అతని బౌలింగ్ ను సమర్ధవంతంగా అడ్డుకున్నాడు. దీంతో హ్యాట్రిక్ అసలు ఆవిరయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో టీమిండియా తరపున తొలిసారి చోటు దక్కించుకొని అద్భుతంగా రాణించిన ఆకాష్ దీప్.. అదే జోరును బంగ్లాదేశ్ పైన కొనసాగిస్తున్నాడు. ఆకాష్ పాటు బుమ్రా తొలి ఓవర్లో వికెట్ తీయడంతో బంగ్లా రెండో రోజు తొలి సెషన్ ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఇస్లాం (2),జాకీర్ హసన్ (3) మోమినల్ హక్ (0) విఫలమయ్యారు.
Also Read :- తొలి రోజు 80 ఓవర్ల ఆట
ప్రస్తుతం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 350 పరుగులు వెనకపడి ఉంది. అంతకముందు భారత్ తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ సెంచరీ (113) తో చెలరేగగా.. జడేజా (86), జైశ్వాల్ (56) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమ్మద్ కు ఐదు వికెట్లు దక్కాయి.
Akash Deep rattles the stumps TWICE before lunch ?
— ESPNcricinfo (@ESPNcricinfo) September 20, 2024
Bangladesh are 26/3, trailing by 350 runs ? https://t.co/hBUP43TiZJ #INDvBAN pic.twitter.com/hYgSTSVqC6