IND vs NZ 3rd Test: అడిగి మరీ తెప్పించుకున్నాడు: కోహ్లీ బ్యాట్ కూడా రనౌట్

ముంబై వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో కోహ్లీ బ్యాట్ రనౌట్ అయింది. తొలి రోజు మ్యాచ్ లో కోహ్లీ రనౌట్ అయితే రెండో రోజు మ్యాచ్ లో అతని బ్యాట్ కూడా రనౌట్ కావడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నమ్మాల్సిన నిజం. అసలు విషయానికి వస్తే.. భారత్ ఇన్నింగ్స్ లో 9 వికెట్ పడిన తర్వాత ఆకాష్ దీప్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఒకటే వికెట్ ఉండడంతో అవతలి ఎండ్ లో సుందర్ హిట్టింగ్ మొదలు పెట్టాడు. దీంతో ఆకాష్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కే పరిమితమయ్యాడు. 

ఇన్నింగ్స్ 60 వ ఓవర్ ప్రారంభంలో కోహ్లీ గిఫ్ట్ ఇచ్చిన బ్యాట్ ను ఆకాష్ డగౌట్ నుంచి తెప్పించుకున్నాడు. అదే ఓవర్ మూడో బంతికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. సుందర్ కోసం వికెట్ త్యాగం చేసినట్టు తెలుస్తుంది. నాలుగో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో బ్యాట్ ను క్రీజ్ లో పెట్టడంలో విఫలమయ్యాడు. దీంతో ఒక్క బంతి ఆడకుండానే డైమండ్ డక్ గా వెనుదిరిగాడు. అంతకముందు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ లో కోహ్లీ గిఫ్ట్ గా ఇచ్చిన బ్యాట్ తోనే ఆకాష్ వరుస సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఆకాష్ దీప్ కొట్టిన సిక్సర్లకు కోహ్లీ వైరల్ అయ్యాడు. 

Also Read : గిల్ సెంచరీ మిస్

ఈ మ్యాచ్ లో ఆకాష్ దీప్ రెండో ఇన్నింగ్స్ లో ఒక అద్భుత బంతితో కివీస్ కెప్టెన్ టామ్ లేతమ్ ను  క్లీన్ బౌల్డ్. ఈ ఫాస్ట్ బౌలర్ వేసిన ఇన్ స్వింగ్ బాల్ కు లేతమ్ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఈ టెస్టులో న్యూజిలాండ్ రెండో రోజు టీ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో  వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ మరో రెండు పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్ లో న్యూజి లాండ్ 235 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 263 పరుగులు చేసి 28 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.