IPL 2025 Mega Action: జాక్స్‌ను వదిలేసిన RCB.. షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన ముంబై

ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురు చూస్తున్న ఆటగాళ్లలో విల్ జాక్స్ ఒకడు. 2024 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ తరపున మెరుపు సెంచరీ చేసిన ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మరోసారి అదే జట్టుకు వస్తాడని అభిమానులు ఆశించారు. అయితే జాక్స్ విషయంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. రూ. 2 కోట్ల రూపాయలతో ఆక్షన్ లోకి వచ్చిన జాక్స్ ను తీసుకోవడానికి ఆర్సీబీ ఆసక్తి చూపించలేదు. ఈ దశలో RTM కార్డు ఏమైనా వాడుతుందని అంతా భావించారు. 

పంజాబ్ కింగ్స్ తో పాటు ముంబై ఇండియన్స్‌కు  మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది. చివరికి ముంబై రూ.5.25 కోట్ల వద్ద ఆగింది.  దశలో ఆర్సీబీ కార్డు ఉపయోగించకపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సమయంలో ఆర్సీబీ సీఈఓ ప్రథమేష్ ముంబై ఓనర్ ఆకాష్ అంబానీ వైపు చూస్తూ సైగ చేశాడు. వెంటనే ఆకాష్ దీప్ అతని వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇవ్వడం షాకింగ్ కు గురి చేసింది. ఈ డీల్ పై నెటిజన్స్ విమర్శిస్తున్నారు. గత సీజన్ లో ఒక సెంచరీతో జాక్స్ 230 పరుగులు చేసాడు. 

Also Read :- ఇప్పటికీ మేమే ప్రపంచ ఛాంపియన్స్.. ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏం కాదు

రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మెగా వేలంలో మొత్తం 19 మంది ప్లేయర్లను కొనుగులు చేసింది.జోష్ హాజిల్‌వుడ్.. రూ.12.50 కోట్లు (ఆస్ట్రేలియా, బౌలర్),ఫిల్ సాల్ట్.. రూ.11.50 కోట్లు (ఇంగ్లండ్, బ్యాటర్),జితేష్ శర్మ.. రూ.11.00 కోట్లు (బ్యాటర్),భువనేశ్వర్ కుమార్.. రూ.10.75 కోట్లు (బౌలర్),లియామ్ లివింగ్‌స్టోన్ర్.. రూ.8.75 కోట్లు (ఇంగ్లండ్, ఆల్ రౌండర్) టాప్ లిస్ట్ లో ఉన్నారు.