చండీఘఢ్ : పంజాబ్ మాజీ స్పీకర్, అకాలీదళ్ (ఎస్ఏడీ) సీనియర్ నేత నిర్మల్ సింగ్ కహ్లాన్ (79) అనారోగ్య సమస్యలతో శనివారం (జులై 16న) చనిపోయారు. పార్టీ సీనియర్ నేత మరణం పట్ల ఎస్ఏడీ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ సంతాపం వ్యక్తం చేశారు. కహ్లాన్ తామందరిలో స్ఫూర్తి నింపేవారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సుఖ్ బీర్ సింగ్ బాదల్ దివంగత నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Senior Shiromani Akali Dal leader and former Punjab Vidhan Sabha Speaker Nirmal Singh Kahlon passes away - tweets party president Sukhbir Singh Badal. pic.twitter.com/zUkRxaLg2c
— ANI (@ANI) July 16, 2022
కహ్లాన్ మరణం బాధాకరమని పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. కహ్లాన్ భౌతికకాయానికి ఆదివారం గురుదాస్‌పూర్ జిల్లాలోని ఫతేగఢ్ సమీపంలోని దదుజోధ్ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
