మహారాష్ట్రలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. శరద్ పవార్‌పై ఆయన సమీప బంధువు అజిత్ పవార్ తిరుగుబాటు చేసి, ప్రత్యర్థి పక్షంతో చేతులు కలిపారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారుఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఆయనతోపాటు ఆయన వర్గానికి చెందిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించాయి. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ బయోను ఛేంజ్ చేశారు.
'డిప్యూటీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర'తో పాటు 'మాజీ LoP, మహారాష్ట్ర శాసనసభ' అనే క్యాప్షన్ ను అజిత్ పవార్ తన ట్విట్టర్ బయోలో చేర్చుకున్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా గవర్నర్ రమేష్ బైస్ చేత ప్రమాణ స్వీకారం చేయగా, మరో ఎనిమిది మంది ఎన్సీపీ నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్, హసన్ ముష్రిఫ్, ధనంజయ్ ముండే, అదితి తత్కరే, ధర్మారావు ఆత్రమ్, అనిల్ పాటిల్, సంజయ్ బన్సోడే ఉన్నారు.
ఈ రోజు తాము మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని అజిత్ పవార్ ప్రమాణ స్వీకారంతరం అన్నారు. తరువాత శాఖలపై చర్చ ఉంటుందన్న ఆయన.. జాతీయ స్థాయిలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, అభివృద్ధికి తోడ్పడాలని భావిస్తున్నట్టు ఆయన తెలిపారు. అజిత్ పవార్ తిరుగుబాటు నేపథ్యంలో ఎన్‌సీపీలో చీలిక కనిపిస్తోంది. 40 మంది సేన ఎమ్మెల్యేలతో ఏకనాథ్ షిండే వాకౌట్ చేసి, బీజేపీ మద్దతుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏడాది తర్వాత, మహారాష్ట్రలో ఎన్సీపీలో సంక్షోభం ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని కూడా బలహీనపరిచింది.
