Irani Cup 2024: ఇరానీ ట్రోఫీ..శార్దూల్ ఈజ్ బ్యాక్.. రహానేకే పగ్గాలు

ఇరానీ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. లక్నో వేదికగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరుగుతుంది. రంజీ ట్రోఫీ విన్నర్ ముంబైతో ఈ మ్యాచ్ లో రెస్టాఫ్ ఇండియా తలబడుతుంది. ముంబై జట్టును రంజీ ట్రోఫీ విజేతగా నిలిపిన రహానే ఇరానీ కప్ లోనూ ముంబైకు కెప్టెన్ గా కొనసాగనున్నాడు. శస్త్ర చికిత్స తర్వాత చాలా నెలల తర్వాత శార్దూల్ ఠాకూర్ ఈ మ్యాచ్ ఆడనున్నాడు. 

శ్రేయాస్ అయ్యర్, ముషీర్ ఖాన్, షామ్స్ ములానీ , తనుష్ కొటియన్ లాంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో ఆడనున్నారు. ప్రస్తుతం భారత జట్టు స్క్వాడ్ లో ఉన్న సర్ఫరాజ్ ఇరానీ కప్ కోసం కాన్పూర్ నుండి లక్నోకు వెళ్లే అవకాశముంది. కాన్పూర్ టెస్ట్ ప్రారంభమైన తర్వాత కూడా సర్ఫరాజ్ లక్నోకు బయలుదేరవచ్చు. చివరి నిమిషంలో ఎవరైనా గాయపడితే తప్ప సర్ఫరాజ్ జట్టు నుంచి రిలీజ్ అవ్వడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. స్టార్ ప్లేయర్లు అందరూ చేరడంతో ముంబై బలంగా కనిపిస్తుంది.

ALSO READ | IND vs BAN 2024: టీమిండియా స్క్వాడ్ నుంచి సర్ఫరాజ్ ఔట్.. కారణం ఏంటంటే..?

టీమిండియా మాజీ వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే ఇటీవల ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇరానీ కప్‌ మ్యాచ్‌ నాటికి రహానే పూర్తి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరానీ ట్రోఫీని చివరి మూడు సార్లు రెస్టాఫ్‌ ఇండియానే గెలిచింది. ముంబై చివరిసారిగా 1998 లో ఇరానీ కప్ ను అందుకుంది. ఈ సారి స్టార్ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండడంతో ముంబై టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.