Ajinkya Rahane: జైశ్వాల్‌ను నాలుగు మ్యాచ్‌ల నిషేధం నుంచి కాపాడిన రహానే

టీమిండియా వెటరన్ ప్లేయర్ గొప్ప కెప్టెన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ లో నాయకుడిగా రహానేది విజయవంతమైన చరిత్ర. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రహానే కెప్టెన్సీలో భారత్ గెలుచుకుంది. జట్టులో సీనియర్లు లేకపోయినా రహానే జట్టును నడిపించిన తీరు అద్భుతం. ప్రస్తుతం భారత జట్టులో స్థానం సంపాదించకపోయినా.. దేశవాళీ క్రికెట్ లో కెప్టెన్ గా అడగొడుతున్నాడు. ముంబై జట్టుకు రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ లను అందించి దూసుకెళ్తున్నాడు. 

రహానే అద్భుతమైన నాయకుడితో పాటు సమయస్ఫూర్తి కలవాడు. తన తెలితో జైశ్వాల్ ను నాలుగు మ్యాచ్ ల నిషేధం నుంచి కాపాడాడు. అదెలాగంటే..2022 దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ వెస్ట్‌ జోన్‌, సౌత్‌ జోన్‌ కు మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో వెస్ట్‌ జోన్‌ తరపున ఆడుతున్న జైశ్వాల్..సౌత్‌ జోన్‌ ఆటగాడు రవితేజకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో జైశ్వాల్ ను రహానే మందలించి మైదానం వీడాల్సిందిగా కోరాడు. రహానే అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.   

ALSO READ : Ranji Trophy 2024: 2 మ్యాచ్‌ల్లో 294 బంతులు.. ద్రవిడ్, పుజారాను తలపిస్తున్న చాహల్
 
జైశ్వాల్ మంచి కోసమే తాను ఆ పని చేయాల్సి వచ్చిందని రహానే అన్నాడు. ఆ సమయంలో తాను అలా చేయకుండా ఉంటే అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం పడి ఉండేదని రహానే తెలిపాడు.  ఆ మ్యాచ్‌లో రహానే వెస్ట్‌ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. యశస్వి జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అదే మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో యశస్వి భారీ డబుల్‌ సెంచరీ (264) చేశాడు. ప్రస్తుతం రహానే రంజీ ట్రోఫీలో ముంబై కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. భారత టెస్ట్ జట్టులో స్థానం కోల్పోయినా దేశవాళీ క్రికెట్, అంతర్జాతీయ లీగ్ లు ఆడుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.