రెహానె ధనాధన్ బ్యాటింగ్.. సెమీఫైనల్లో ముంబై

 

ఆలూర్‌‌‌‌: టీమిండియా వెటరన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ అజింక్యా రహానె (45 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌లతో 84).. సయ్యద్‌‌‌‌ ముస్తాక్‌‌‌‌ అలీ టీ20 టోర్నీలో ధనాధన్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌తో రెచ్చిపోయాడు. దీంతో బుధవారం జరిగిన క్వార్టర్‌‌‌‌ఫైనల్లో ముంబై 6 వికెట్ల తేడాతో విదర్భపై నెగ్గి సెమీస్‌‌‌‌లోకి అడుగుపెట్టింది. టాస్‌‌‌‌ ఓడిన విదర్భ 20 ఓవర్లలో 221/6 స్కోరు చేసింది. అథర్వ తైడే (66), అపూర్వ్‌‌‌‌ వాంఖడే (51), శుభం దూబే (43) రాణించారు. అథర్వ అంకోలేకర్‌‌‌‌, సూర్యాన్ష్‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత ముంబై 19.2 ఓవర్లలో 224/4 స్కోరు చేసి నెగ్గింది. 

పృథ్వీ షా (49), శివం దూబే (37 నాటౌట్‌‌‌‌), సూర్యాన్ష్‌‌‌‌ (36 నాటౌట్‌‌‌‌) ఆకట్టుకున్నారు. దీపేశ్‌‌‌‌ పర్వాని 2 వికెట్లు పడగొట్టాడు. రహానెకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. మరోవైపు  బౌలింగ్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ పాండ్యా (3/27), లుక్మాన్‌‌‌‌ మెరివాలా (3/17), అతిత్‌‌‌‌ షీత్‌‌‌‌ (3/41) మెరవడంతో.. తొలి క్వార్టర్‌‌‌‌ఫైనల్లో బరోడా 41 రన్స్‌‌‌‌ తేడాతో బెంగాల్‌‌‌‌ను ఓడించి సెమీస్‌‌‌‌లోకి దూసుకెళ్లింది. ముందుగా బరోడా 20 ఓవర్లలో 172/7 స్కోరు చేసింది. శశ్వాత్‌‌‌‌ రావత్‌‌‌‌ (40), అభిమన్యు సింగ్‌‌‌‌ రాజ్‌‌‌‌పుత్‌‌‌‌ (37) ఫర్వాలేదనిపించారు. 

ఛేజింగ్‌‌‌‌లో బెంగాల్‌‌‌‌ 18 ఓవర్లలో 131 రన్స్‌‌‌‌కే పరిమితమైంది. మరో క్వార్టర్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో వెంకటేశ్ అయ్యర్‌‌‌‌ (38, 2/23) ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో చెలరేగడంతో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్రను ఓడించి ముందంజ వేసింది.  సౌరాష్ట్ర 20 ఓవర్లలో 173/7 స్కోరు చేసింది. తర్వాత మధ్యప్రదేశ్‌‌‌‌ 19.2 ఓవర్లలో 174/4 స్కోరు చేసి గెలిచింది.  ఇంకో మ్యాచ్‌‌‌‌లో   ఢిల్లీ 19 రన్స్‌‌‌‌ తేడాతో ఉత్తరప్రదేశ్‌‌‌‌పై గెలిచి సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ సొంతం చేసుకుంది.